NTV Telugu Site icon

Nani: ఆ షో కి పిలిచినా రానని గౌరవంగా చెప్పేస్తాను..

Whatsapp Image 2023 11 11 At 4.08.19 Pm

Whatsapp Image 2023 11 11 At 4.08.19 Pm

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు…రీసెంట్ గా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.అంతే కాదు నాని ప్రయోగాత్మక సినిమాలకు ఓకే చెప్తూ విభిన్న కాన్సెప్ట్ లు సెలక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. నేచురల్ స్టార్ ఎక్కువగా యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇస్తున్నాడు..కొత్తవారికి కూడా ఛాన్స్ లు ఇస్తూ..నాని మంచి మంచి దర్శకులను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు.నాని త్వరలో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాని వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా హైలెట్ అవుతున్నాడు.. సినిమాలకు సంబంధిన కొన్ని అంశాలపై కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా బాలీవుడ్ పై అందులోను స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ పై నాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఓ నేషనల్ మీడియా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నాని బాలీవుడ్ కరణ్ జోహార్ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సమావేశంలో బాలీవుడ్ టాప్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోకి పిలిస్తే వెళ్తారా అని అడగ్గా.. నాని ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ.. కాఫీ విత్ కరణ్ షోకి పిలిచినా రాను అని గౌరవంగా చెప్పేస్తాను. కరణ్ జోహార్ ని కలిసి, సినిమాల గురించి కాసేపు మాట్లాడమంటే ఓకే కానీ ఆ షోకి మాత్రం నేను వెళ్ళను. నాలాంటి వాళ్లకి ఆ షో అస్సలు సెట్ అవ్వదు. దీంతో నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి.బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ టాక్ షో పాపులర్ షోగా పేరు తెచ్చుకుంది.. కాని ఈ షో అంటే చాలా మందికి కూడా నెగెటీవ్ ఫీలింగ్ ఉంది. సెలబ్రిటీలు ఈ షోకు వెళ్ళడానికి అంతగా ఇష్టపడరు.. ఈ షోలో కరణ్ సినిమాల వరకూ అడిగితే బాగుంటుంది. కాని సెలబ్రిటీల పర్సనల్స్ విషయాల గురించి అడిగి వారి పరువు తీస్తున్నాడన్న విమర్శ కూడా ఉంది.దీనితో నాని కూడా ఈ షోకి పిలిచినా వెళ్ళను అని చెప్పినట్లు సమాచారం..

Show comments