NTV Telugu Site icon

Nani Movie: నాని-ప్రియదర్శి సినిమాకు ఇంట్రెస్టింగ్‌ టైటిల్.. పోస్టర్ రిలీజ్!

Court Movie

Court Movie

Priyadarshi and Nani New Movie: ‘నేచురల్ స్టార్’ నాని ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా కూడా మూవీస్ తెరకెక్కిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’పై ఇప్పటికే కొన్ని చిత్రాలు రాగా.. నేడు మరో సినిమాను ప్రకటించారు. ఇటీవల ‘డార్లింగ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రియదర్శిని హీరోగా పెట్టి తన నిర్మాణ సంస్థలో ఓ సినిమా తీస్తున్నా అని ప్రకటించిన నాని.. నేడు ఆ చిత్రంను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు టైటిల్ కూడా రివీల్ చేశారు.

రామ్ జగదీశ్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా చేస్తున్న సినిమాకు ‘కోర్ట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘State vs A Nobody’ అనేది ట్యాగ్‌లైన్‌. ఇందుకు సంబంధించిన పోస్టర్, మోషన్ పోస్టర్‌ని నేడు రిలీజ్ చేశారు. కోస్టల్ ఏరియా, డాక్యుమెంట్స్‌, కోర్టు బోను, న్యాయ దేవత లాంటి విజువల్స్‌తో పోస్టర్‌ని వదిలారు. ఈ మోషన్‌ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిరినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నాని సమర్పకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నారు.

Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. ఈరోజు గోల్డ్ రేట్ ఎంతుందంటే?

ఈరోజు కోర్ట్ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయింది. నాని క్లాప్‌ కొట్టగా.. నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచాన్‌ చేశారు. తొలి షాట్‌కి జెమినీ కిరణ్‌ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఇందులో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీ దేవి తదితరులు నటిసున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే డార్లింగ్ సినిమాతో ప్రియదర్శి ప్రేక్షకుల ముందుకు రాగా.. నాని ‘సరిపోదా శనివారం’తో వచ్చారు.

Show comments