Site icon NTV Telugu

Hyderabad: ఉద్రిక్తత! నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు..

Nampally Court

Nampally Court

Nampally Court Bomb Threat: నగరంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు పంపిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు పరిసరాలను పూర్తిగా ఖాళీ చేయిస్తున్నారు. నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెదిరింపు కాల్ లేదా మెసేజ్ వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకున్న అనంతరం కోర్టు కార్యకలాపాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం నాంపల్లి కోర్టు పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

READ MORE: Bride Cancels Wedding: తాళి కట్టే టైంలో వరుడి మెలిక.. పెళ్లికొడుక్కే షాకిచ్చిన వధువు

Exit mobile version