Site icon NTV Telugu

POCSO Court: పోక్సో కేసులో నిందితుడికి 21 ఏళ్ల శిక్ష, 30 వేల జరిమానా.. బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం

Law News

Law News

నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు పోక్సో కేసులో సంచలన తీర్పునిచ్చింది. ఫోక్సో కేసులో నిందితుడికి 21 ఏళ్ల శిక్ష, 30 వేల జరిమానా ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 2018 లో చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. విచారణ అనంతరం కోర్టు పై తీర్పును వెలువరించింది. మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వేధింపులకు అడ్డుకట్టపడడం లేదు. ఎక్కడో ఓ చోట ఆకతాయిలు వేధిస్తున్నారు. కోర్టులు కఠినమైన శిక్షలు, జరిమానాలు విధిస్తు్న్నప్పటికీ కొందరు పోకిరీలు మారడం లేదు. మహిళలను వేధింపులకు గురిచేస్తు్న్న వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version