Site icon NTV Telugu

Nalgonda: ఏరియా ఆసుపత్రిలో దారుణం.. వైద్యం వికటించి 15 చిన్నారులకు తీవ్ర ఆస్వస్థత..!

Nalgonda

Nalgonda

Nalgonda: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో వైద్యం వికటించింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న 15 మంది చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఇంజెక్షన్‌ వికటించడంతోనే పిల్లలకు వాంతులు, విరోచనాలు, చలి, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పిల్లల పరిస్థితి విషమించడంతో ఆస్పత్రి సిబ్బంది వారిని అత్యవసరంగా ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆసుపత్రిల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తల్లిదండ్రులు ఆస్పత్రి నిర్లక్ష్యాన్ని కారణంగా పేర్కొంటూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

READ MORE: Parakamani Case: పరకామణి కేసులో కీలక సాక్షి మృతి.. హత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు..

Exit mobile version