NTV Telugu Site icon

Viral Wash Basin: వీళ్లేంటి ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు… మంత్రిని ఆకట్టుకున్న క్రియేటివిటీ!

Nagaland Copy

Nagaland Copy

ప్రపంచ చరిత్ర నుంచి ఏది చూసినా మనిషి ప్రతీది తన అవసరం కారణంగానే కనుగొన్నాడు. అవసరం మనిషి చేత దేనినైనా చేయిస్తుంది. వేటినైనా కనిపెట్టేలా చేస్తుంది. సామాన్యుడిని ఇంజనీర్ లా మారేలా కూడా చేస్తుంది. ఎంతో మంది సామాన్యులు వినూత్నంగా కనిపెట్టిన అనేక వస్తువులు సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్ అవుతున్నాయి. వారి టాలెంట్ ప్రపంచం మొత్తం చూసే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం అలాంటి ఒక వినూత్న ఆవిష్కరణే నాగాలాండ్ ఉన్నత విద్య, పర్యాటక శాఖ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ కంటపడింది. దీంతో ఆయన తన ట్విటర్ ఖాతాలో ఆ వీడియో పోస్ట్ చేశారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి దాన్ని చూశారా అంటూ ఆయన ఆ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read: Viral Video: టీచరమ్మ నువ్వు గ్రేట్… ప్రతి ఆడపిల్ల చూడాల్సిన వీడియో!

ఆ వీడియోలో ఒక వెరైటీ వాష్ బేషిన్ ఉంది. అయితే అది స్టెయిన్ లెస్ స్టీల్ తోనో, స్టోన్ తోనోచేసింది కాదు సహజసిద్దమైన వెదురుతో రూపొందించింది. ఇది ఒక్కటే దీని ప్రత్యేకత కాదు ఆ వాష్ బేషిన్‌ను ఒకరిద్దరు కాదు ఏకంగా ఊరు ఊరంతా ఉపయోగిస్తున్నారు. ఈ వాష్ బేషిన్ కోసం ముందుగా వెదురు గొట్టాలను అమర్చి వాటి నుంచి నీరు వెళ్లేలా చేశారు. అంతే కాకుండా వాటికి అక్కడక్కడ రంధ్రాలు చేసి స్టాపర్లు కూడా అమర్చారు. దీనితో పాటు ప్రతి స్టాపర్ దగ్గర చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బు, టవల్స్ ను కూడా అమర్చారు.

గ్రామస్తుల క్రియేటివిటీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఏం క్రియేటివిటీరా బాబు అంటూ ప్రశంసిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 10 వేలకు పైగా లైకులు రాగా, దాదాపు 2 లక్షల మందికి పైగా చూశారు.