NTV Telugu Site icon

Naga Chaitanya : నాగచైతన్య నెక్ట్స్ మూవీ బడ్జెట్ అంతనా.. నోరెళ్ల బెడుతున్న ఫ్యాన్స్

Naga Chaitanya

Naga Chaitanya

Naga Chaitanya : యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. నిజ జీవిత కథగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడి తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన కొందరు యువకులు పాక్ నేవీ సిబ్బంది చేత చిక్కి పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

Read Also: IND vs AUS: ఐపీఎల్ వేలంలో ఏ టీంకు వెళ్తున్నావు..? మ్యాచ్ మధ్యలో నాథన్ లియాన్, పంత్ సంభాషణ

ఆ సమయంలో తన ప్రియురాలు శ్రీకాకుళంలో ఉండడంతో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? చివరికి వారంతా పాకిస్తాన్ జైలు నుంచి ఎలా బయటకు వచ్చారు? లాంటి అంశాలను చాలా నేచురల్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ముందుగా డిసెంబర్ నెల 2024 లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ సినిమాలు క్యూ కట్టి ఉండడంతో ఈ సినిమాని ఫిబ్రవరి 7న రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

Read Also:Mechanic Rocky Review: విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ రివ్యూ!

అయితే, ఈ సినిమా రిలీజ్‌కి ముందే నాగచైతన్య నెక్స్ట్ మూవీ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్‌లో నాగచైతన్య తన నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను సరికొత్త కథతో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందట. అయతే, ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.110 కోట్ల మేర కేటాయించనున్నారట మేకర్స్. ఇందులో రూ.30 కోట్లు కేవలం వీఎఫ్ఎక్స్‌కే వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై అప్పుడే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రొరంభించేందుకు యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Show comments