NTV Telugu Site icon

Naga Chaitanya : మైసూర్ వెళ్లొచ్చిన చైతూ-కృతిశెట్టి జోడి

Chaitu Kruthi

Chaitu Kruthi

Naga Chaitanya : హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారు నాగచైతన్య. ఈ ఏడాది ఇప్పటికే చైతు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆరు నెలల గ్యాపులోనే ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం నాగచైతన్య ‘మానాడు’ ఫేం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నాడు. ఈ చిత్రంలో చైతన్య పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.

Read Also: OTT Updates: ధనుష్ ‘నేనే వస్తున్నా’ ఓటీటీ డేట్ ఫిక్స్

కాగా చిత్రబృందం తాజాగా మైసూర్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో నాగచైతన్యతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలోనే సెకండ్‌ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీకొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. తండ్రికొడుకులు కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. స్టార్ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి మాటలు అందిస్తున్నాడు. అలాగే నాగచైతన్య నటించిన ‘ధూత’ వెబ్‌సిరీస్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. సూపర్‌ నాచ్యుర‌ల్ ప‌వ‌ర్స్ నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ను నార్త్ స్టార్ ఎంట‌ర్టైన‌మెంట్స్‌తో క‌లిసి అమేజాన్ ఒరిజిన‌ల్స్ నిర్మిస్తుంది.

Show comments