NTV Telugu Site icon

Naga Shaurya : క్యూట్ భాయ్ నాగశౌర్య కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసిందోచ్

New Project (78)

New Project (78)

Naga Shaurya : టాలీవుడ్ యంగ్ హీరో ఆయిన నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన చేసే ప్రతి సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా నాగ శౌర్య వంద శాతం ఆ సినిమా కోసం కష్టపడతారు.. అందుకే నాగ శౌర్య సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ వుంటారు. నాగ శౌర్య నటించిన ఆఖరి సినిమా రంగబలి. ఈ సినిమాలో యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను పవన్ బసంశెట్టి తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్లో మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు.

Read Also:Nandamuri Thaman: నారా భువనేశ్వరి నోట నందమూరి తమన్ కామెంట్స్

తాజాగా నాగశౌర్య ఓ సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవల చాలా సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ఓ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్‌ను మేకర్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమాలో నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను రామ్ దేసిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య సరికొత్త లుక్‌తో కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను జనవరి 22న ఉదయం 10.08 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. దీంతో నాగ శౌర్య నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అవుతుంది. మరి ఈ సినిమాకు మేకర్స్ ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తారో చూడాలి.

Read Also:Venkatesh : 25ఏళ్ల నాటి సంక్రాంతి సీన్ రిపీట్.. ఈ సారి కూడా విక్టరీ ఆ హీరోదే