Naga Shaurya : ఆ సినిమా ప్లాప్ అవుతుందని అప్పుడే అర్థమైంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తాజాగా ఈయన నటించిన సినిమా రంగబలి.ఈ సినిమాను పవన్ బాసంశెట్టి తెరకెక్కించారు.ఈ సినిమాలో యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా జులై 7 న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.. ఈ సినిమా కోసం నాగశౌర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో ఎంతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న హీరో నాగశౌర్య పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ.. నేను హీరోగా నటించిన ఒక సినిమా దారుణమైన పరాజయం అందుకుంది.
ఆ సినిమా కోసం నేను ఎంతో శ్రమించాను. బాడీ పరంగా అలాగే లుక్ పరంగా ఎన్నో మార్పులు చేసుకున్నాను. కథ చెప్పినప్పుడు భారీ సెట్స్ అలాగే ప్రముఖ నటీనటులతో ఈ సినిమా ఉంటుందని నాకు చెప్పారు. కానీ సెట్స్ లోకి అడుగుపెట్టాక అక్కడి పరిస్థితులు చెప్పినదానికి భిన్నంగా ఉన్నాయి. ఇలా అయితే సినిమా ఆడదు అని చెప్పేసాను.. మీకు ఒకవేళ ఫ్లాప్ సినిమా చేయాలని ఉంటే కచ్చితంగా చేద్దాం. కానీ ఈ సినిమా కోసం నేను ఎంతో కష్టపడ్డాను. దీనిపై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నా అది తలుచుకుంటే కొంచెం బాధగా ఉంది అని ఆ సినిమా నిర్మాతకు చెప్పేశాను. నేను నటించిన ఎన్నో సినిమాలకు వేరే వ్యక్తులు సలహాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సినిమా చిత్రీకరిస్తున్నప్పుడే కొందరు ఆ సీన్స్ లో మార్పు చేస్తే బాగుంటుంది అని సూచనలు ఇచ్చేవారు.వారి మాటలు నేను కూడా కాదనలేక అన్నింటికీ ఓకే అనేవాడిని. అలా వచ్చిన కొన్ని సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి అని నాగ శౌర్య తెలిపారు. ఇక అప్పటి నుంచి ఎవరి సలహాలు పాటించకూడదు అని నిర్ణయించుకున్నాను అని నాగ శార్య తెలిపారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!