NTV Telugu Site icon

Dhootha : నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Whatsapp Image 2023 11 01 At 11.39.12 Am

Whatsapp Image 2023 11 01 At 11.39.12 Am

అక్కినేని నాగ చైతన్య రీసెంట్ గా కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాను తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించారు.. కస్టడీ సినిమా నాగ చైతన్య కెరీర్ లో మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది.. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.. కస్టడీ సినిమా ప్లాప్ అవ్వడం తో నాగ చైతన్య ప్రేక్షకులు మెచ్చే విధంగా సూపర్ హిట్ సినిమాను ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు..దీనితో తనకు గతంలో ప్రేమమ్ వంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన చందు మొండేటి తో మరో సినిమాను కమిట్ అయ్యాడు..ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య సినిమాను . జీఏ2 సంస్థ నిర్మిస్తోంది..ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్నాయి. జాలర్ల జీవితాల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా మూవీకి తాండేల్ అనే వర్కింగ్ టైటిల్‌ను కూడా పరిశీలిస్తోన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే నాగచైతన్య నటించిన ధూత వెబ్‌సిరీస్ షూటింగ్ పూర్తయి చాలా కాలమైంది. కానీ రిలీజ్ డేట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేదు.తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయినట్లు సమాచారం. డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ వెబ్ సిరీస్ ను ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలిసింది. సూపర్ నాచురల్ హారర్ కథతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌కు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.ధూత వెబ్‌సిరీస్ టీజర్‌ను దీపావళికి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా సాగబోతున్నట్లు తెలుస్తుంది.. ఇందులో నాగచైతన్య జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం… గతంలో నాగచైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో మనం, థాంక్యూ సినిమాలొచ్చాయి.వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్‌లో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ధూత వెబ్ సిరీస్‌తోనే నాగచైతన్య, విక్రమ్ కే కుమార్ ఇద్దరూ కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు ధూత వెబ్‌సిరీస్‌తో నాగచైతన్య ఫస్ట్ టైమ్ హారర్ జోనర్ లో నటిస్తున్నాడు. ఇందులో పార్వతి, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.