Dhootha : నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగ చైతన్య రీసెంట్ గా కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాను తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించారు.. కస్టడీ సినిమా నాగ చైతన్య కెరీర్ లో మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది.. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.. కస్టడీ సినిమా ప్లాప్ అవ్వడం తో నాగ చైతన్య ప్రేక్షకులు మెచ్చే విధంగా సూపర్ హిట్ సినిమాను ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు..దీనితో తనకు గతంలో ప్రేమమ్ వంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన చందు మొండేటి తో మరో సినిమాను కమిట్ అయ్యాడు..ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య సినిమాను . జీఏ2 సంస్థ నిర్మిస్తోంది..ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్నాయి. జాలర్ల జీవితాల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా మూవీకి తాండేల్ అనే వర్కింగ్ టైటిల్‌ను కూడా పరిశీలిస్తోన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే నాగచైతన్య నటించిన ధూత వెబ్‌సిరీస్ షూటింగ్ పూర్తయి చాలా కాలమైంది. కానీ రిలీజ్ డేట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేదు.తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయినట్లు సమాచారం. డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ వెబ్ సిరీస్ ను ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలిసింది. సూపర్ నాచురల్ హారర్ కథతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌కు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.ధూత వెబ్‌సిరీస్ టీజర్‌ను దీపావళికి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా సాగబోతున్నట్లు తెలుస్తుంది.. ఇందులో నాగచైతన్య జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం… గతంలో నాగచైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో మనం, థాంక్యూ సినిమాలొచ్చాయి.వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్‌లో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ధూత వెబ్ సిరీస్‌తోనే నాగచైతన్య, విక్రమ్ కే కుమార్ ఇద్దరూ కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు ధూత వెబ్‌సిరీస్‌తో నాగచైతన్య ఫస్ట్ టైమ్ హారర్ జోనర్ లో నటిస్తున్నాడు. ఇందులో పార్వతి, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!