Vrushakarma : చైతు ‘వృషకర్మ’ గ్లింప్స్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..

Nagachaithanya Vrushakarma

Nagachaithanya Vrushakarma

అక్కినేని నాగచైతన్య హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను అత్యంత గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ఒక ఆసక్తికరమైన వేదికను ఎంచుకున్నారు.

Also Read : Kanchana 4: హోలీ కానుకగా.. ‘కాంచన’ మూవీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

ఈ నెల మార్చి 5న విడుదల కానున్న ‘వృషకర్మ’ గ్లింప్స్‌ను తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్దదైన హైదరాబాద్‌లోని ప్రసాద్స్ పి సి ఎక్స్ (Prasads PCX) స్క్రీన్‌పై ప్రదర్శించనున్నారు. మార్చి 5వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. కేవలం మీడియా ప్రతినిధులు మాత్రమే కాకుండా, పెద్ద సంఖ్యలో అక్కినేని అభిమానులు కూడా ఈ ఈవెంట్‌కు హాజరుకానున్నారు. భారీ స్కేల్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ గ్లింప్స్ చైతు కెరీర్‌లోనే ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.