యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్.. కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వంలో సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.ఈ చిత్రంలో శ్రీకాకుళం మత్య్సకారుడి పాత్రను చైతూ పోషిస్తున్నారు. సాయిపల్లవి ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. కాగా, నాగచైతన్య ప్రధాన పాత్రలో గతేడాది దూత వెబ్ సిరీస్ వచ్చింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో వచ్చిన దూత సీజన్ 1 వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అవడంతో రెండో సీజన్ కూడా రానుందని కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. నాగచైతన్య కూడా ఈ ప్రాజెక్టుపై ఎంతో ఆసక్తితో ఉన్నారని సమాచారం. ఇప్పుడు, దూత సీజన్ 2 గురించి ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. నాగ చైతన్యతో ఓ వీడియోను నేడు (మార్చి 17)అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది.నాగచైతన్య న్యూస్ పేపర్ చదువుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. ఆ పేపర్‌పై పెద్దగా మార్చి 19 అని రాసి ఉంది. “కన్‍ఫ్యూజ్ అవుతున్నారా..? ఇంకా క్లూస్ కావాలా..? మార్చి 19న.. మీరు రెడీనా?” అని నాగచైతన్య అన్నారు.
దూత వెబ్ సిరీస్‍లో న్యూస్ పేపర్ ప్రధానంగా ఉంటుంది. కథను ముందుకు నడిపిస్తుంది. ఈ వీడియోలో న్యూస్ పేపర్‌తో నాగ చైతన్య కనిపించడంతో ఇది దూత సీజన్ 2 అనౌన్స్‌మెంట్ గురించే అని తెలుస్తుంది.మార్చి 19న ఈ రెండో సీజన్‍కు సంబంధించి అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించనుంది.గతేడాది డిసెంబర్ 1న స్ట్రీమింగ్‍కు వచ్చిన దూత సీజన్ 1 వెబ్ సిరీస్‍కు భారీ వ్యూస్ దక్కాయి. ఈ సిరీస్ కొన్ని వారాల పాటు గ్లోబల్ వైడ్ ట్రెండింగ్‍లో నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ మరియు తమిళం భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సీజన్ చాలా సక్సెస్ అయింది.భవిష్యత్తులో జరిగే ఘటనల గురించిన కొన్ని న్యూస్ పేపర్ కటింగ్స్ జర్నలిస్ట్ సాగర్ వర్మ అవధూరి (నాగచైతన్య)కి దొరకడం.. ఆ న్యూస్ పేపర్ లలో ఉన్నట్లు గానే జరగడం చుట్టూ దూత సీజన్ 1 రూపొందింది. ఉత్కంఠ భరితంగా దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ సీజన్‍ను తెరకెక్కించారు. మిస్టరీతో పాటు హారర్ ఎలిమెంట్ కూడా ఉంది. సీజన్ 1 విపరీతంగా ఆకట్టుకోవడంతో దూత సీజన్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి.
Yuvasamrat @chay_akkineni is spilling the beans about a clueless mystery 👀🔥
Watch out the space, @PrimeVideoIN to unfold on March 19th. #NagaChaitanya pic.twitter.com/O7WAZTpO1Q
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 17, 2024
