Naga Chaitanya : నాగ చైతన్య కోసం ‘‘లక్కీ’’ హీరోయిన్
- చైతూతో ఫస్ట్ టైం రొమాన్స్ చేయనున్న మీనాక్షి
- కార్తీక్ దండు డైరెక్షన్లో డిసెంబర్ 11న కొత్త సినిమా షురూ
- మరో హీరోయిన్ గా పూజా హెగ్డే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ఈసారి బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అతని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తాజా సినిమా తండేల్. ప్రస్తుతం పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చందూ మొండేటి డైరెక్షన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతన్య నట విశ్వరూపం చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అసలైతే ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇక నవంబర్ ముగిసేలోపు ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తిచేయాలని చైతన్య ధృడంగా నిర్ణయించుకున్నాడు. దీని తర్వాత ఆయన తన తదుపరి చిత్రానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో చైతన్య తదుపరి సినిమా తెరకెక్కనుంది. డిసెంబర్ 11న హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ షురూ కానుంది. ఈ చిత్రంలో చైతన్య సరసన ఎవరు నటిస్తారన్న విషయంలో అనేక రకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి.
Read Also:Emotional Scene: కంటతడి పెట్టించే సన్నివేశం.. తండ్రిని చూసి భావోద్వేగానికి గురైన కూతుళ్లు..
Also Read
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి నాగ చైతన్యతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంబో సెట్టయితే చైతన్య, మీనాక్షి కలిసి పనిచేసే ఫస్ట్ మూవీ ఇదే అవుతుంది. ఇటీవల లక్కీ భాస్కర్ తో మీనాక్షి చౌదరి కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంది. ఆమె నటించిన మట్కా కూడా ఇటీవల విడుదల కాగా అది డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆమె నెక్స్ట్ విశ్వక్ సేన్ తో కలిసి మెకానిక్ రాకీ అనే సినిమాతో రాబోతుంది. ఇక నాగచైతన్య మీనాక్షి చౌదరి జోడి తెరపై కొత్తగా అనిపిస్తుందని టీమ్ భావించింది. మీనాక్షి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. మెకానిక్ రాకీతో పాటు వెంకటేశ్ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఆమె ఈ మధ్యే చైతన్య సినిమాలో సైన్ చేసేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్రలో పూజా హెగ్డే నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read Also:Dulquer Salmaan : లక్కీ భాస్కర్ రన్నింగ్ సూపర్..మొత్తం ఎన్ని కొట్లో తెలుసా..?
బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. విరూపాక్ష లాంటి మిస్టిక్ థ్రిల్లర్ కథాంశంతోనే ఈ సినిమా రూపొందనున్నట్లు టాక్. మీనాక్షి చౌదరి లాంటి గ్లామరస్ హీరోయిన్, చైతూ సరసన నటించబోతుండడంతో ఈ జంటపై అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇక నాగచైతన్య ఈ మధ్య కంప్లీట్ గా స్టైల్ మార్చేశాడు. కొత్త తరహా కథాంశాలను ఎంచుకుంటూ, కొత్త దర్శకులతో ప్రయోగాలు చేస్తున్నారు. ఇక తండేల్ తో బిగ్ సక్సెస్ అందుకుంటే తర్వాత సినిమాలపై మరింత హైప్ పెరిగే అవకాశం ఉండొచ్చు.
తాజావార్తలు
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!