NTV Telugu Site icon

Kalki 2898 AD : ఆ మూడు ప్రపంచాల మధ్య యుద్ధమే కల్కి కథ : నాగ్ అశ్విన్

Kalki (3)

Kalki (3)

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా రిలీజ్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీ గా వుంది.ఇదిలా ఉంటే ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ముంబైలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.ఈ ఈవెంట్ కు అమితాబ్ బచ్చన్ ,ప్రభాస్ ,కమల్ హాసన్ ,నాగ్ అశ్విన్ ,అశ్వినీదత్ ,దీపికా పదుకోన్ హాజరు అయ్యారు.అలాగే ఈ ఈవెంట్ కు స్టార్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహరించారు.ఈ సినిమాలో తమ ఎక్స్పీరియన్స్ ను వారు రానాతో షేర్ చేసుకున్నారు.

Read Also :Priyanka Chopra : గ్లోబల్ బ్యూటికి షూటింగ్ లో గాయాలు..

ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ లో ఓ బిగ్ టికెట్ ను లాంచ్ చేయగా ఆ టికెట్ ను బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసారు.ఈ టికెట్ ను కమల్ హాసన్ కు గిఫ్ట్ గా ఇచ్చారు .అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఈ సినిమా స్టోరీ గురించి తెలిపారు.ఈ సినిమా కాశీ,కాంప్లెక్స్ ,శంభల అనే మూడు ప్రపంచాల మధ్య సాగే కధ.ప్రపంచంలోనే ఆఖరి నగరం అయిన కాశిలో గంగా నది ఎండిపోయిన సమయంలో అక్కడి ప్రజలు ఎంతో దుర్భర జీవితాన్ని అనుభవిస్తుంటారు.అన్ని సౌకర్యాలు వుండే కాంప్లెక్స్ కు వారు వెళ్లాలని అనుకుంటారు.అలాగే శంభల అనే నగరం నుంచి కాంప్లెక్స్ పై దాడి జరుగుతుంది అని నాగ్ అశ్విన్ తెలిపారు.ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.