Naatu Naatu Song: నాటు నాటును బాగానే వాడేస్తున్నారుగా… ట్రెండ్ ఫాలో అవుతున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naatu Naatu Song: ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పాపులారిటీ తెచ్చుకుందో అందరికి తెలిసిందే. ఆ సినిమాతో పాటు సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను తెగ మెప్పించాయి. ముఖ్యంగా సినిమాలోని నాటు నాటు సాంగ్ అయితే విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఇప్పటికే ఈ పాట ఆస్కార్ క్వాలిఫికేషన్ లిస్ట్‌లోకి కూడా ఎంట్రీ అయింది. ఇక ఆస్కార్ తర్వాత ఉన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఇటీవలే నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ విభాగంలో సొంతం చేసుకుంది. దీంతో నాటు నాటు మరింత పాపులర్ అయింది. దేశమంతా ఈ పాటకి అవార్డు వచ్చిన సందర్భంగా చిత్రయూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఈ పాటకి ఉన్న క్రేజ్ ని అందరూ వాడుకుంటున్నారు. కొంతమంది నాటు నాటు క్రేజ్‌ను బిజినెస్‌కు వాడుకుంటుంటే మరికొంతమంది జనాల్లో అవగాహన తీసుకురావడానికి వాడుతున్నారు. తాజాగా ఈ పాటను ఉత్తరప్రదేశ్ పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహనం కల్పించడానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న పాట “నాటు నాటు” పాటను ఉపయోగించుకున్నారు. అది ప్రస్తుతం వైరల్‌గా మారింది.
రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యూపీ పోలీసులు ‘ఆర్‌ఆర్‌ఆర్’ టైటిల్‌ను వాడుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ పోస్టర్‌ను ట్రాఫిక్ రూల్‌కు అనుగుణంగా ఎడిట్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ టైటిల్‌ను సూచించేలా ” Respect the Red light on the Road” అని ఎడిట్ చేయగా.. అది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రెడ్ లైట్ పడినప్పుడు ఆగాలని ఆ విధంగా అవగాహన కల్పించారు. ఈ ఫోటోతో పాటు మరికొన్ని నిబంధనలను సూచించారు. ద్విచక్రవాహనంపై ఇద్దరి కన్నా ఎక్కువ మంది ఉండొద్దని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయొద్దని వివరించారు. ఇలా చెప్తే ప్రజలకు త్వరగా అర్థమవుతుందని పోలీసులు ఈ ట్రెండ్ ఫాలో అయిపోయారు.
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
VD12: రామ్ చరణ్ కు సెట్ కాలేదు విజయ్ కు సెట్ అవుతుందా..?
ప్రజలకు రోడ్డు నిబంధనలను వివరిస్తూ వారిని చైతన్యపరిచేందుకే నాటునాటు పాటను రిఫరెన్స్‌గా తీసుకున్నామని యూపీ పోలీసులు వెల్లడించారు. చాలా రోజులుగా తాము బాలీవుడ్ పాటల్ని ఇలా రిఫరెన్స్‌గా తీసుకుని రూల్స్ గురించి చెబుతున్నామన్నారు. మహిళా భద్రతతో పాటు మరి కొన్ని విషయాల్లోనూ అవగాహన కల్పిస్తున్నామని ఆ రాష్ట్ర పోలీసులు స్పష్టం చేశారు. “నాటు నాటు” పాటను పాడిన రాహుల్ సిప్లిగంజ్.. రోడ్డు భద్రత కోసం దీనిని ఉపయోగించినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులకు ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. రహదారి భద్రత ప్రచారానికి ఆకర్షణీయమైన నినాదాన్ని రూపొందించడంలో ఈ పాట సహాయపడిందని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ అన్నారు.
The nominations for Golden Glob(al) rules of #RoadSafety ; #Naatu,Kabhi red light skip kare#Naatu,Kabhi tripling kare#Naatu,Kabhi drunken driving kare#Naatu,Kabhi traffic rules tode
Congratulating the makers of #RRR for winning the Best Original Song award #GoldenGlobes2023 pic.twitter.com/y5vZhT0WMK
— UP POLICE (@Uppolice) January 11, 2023
తాజావార్తలు
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!