NTV Telugu Site icon

Naatu Naatu Song: నాటు నాటును బాగానే వాడేస్తున్నారుగా… ట్రెండ్ ఫాలో అవుతున్న పోలీసులు

Naatu Naatu

Naatu Naatu

Naatu Naatu Song: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పాపులారిటీ తెచ్చుకుందో అందరికి తెలిసిందే. ఆ సినిమాతో పాటు సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను తెగ మెప్పించాయి. ముఖ్యంగా సినిమాలోని నాటు నాటు సాంగ్ అయితే విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఇప్పటికే ఈ పాట ఆస్కార్ క్వాలిఫికేషన్ లిస్ట్‌లోకి కూడా ఎంట్రీ అయింది. ఇక ఆస్కార్ తర్వాత ఉన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఇటీవలే నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ విభాగంలో సొంతం చేసుకుంది. దీంతో నాటు నాటు మరింత పాపులర్ అయింది. దేశమంతా ఈ పాటకి అవార్డు వచ్చిన సందర్భంగా చిత్రయూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఈ పాటకి ఉన్న క్రేజ్ ని అందరూ వాడుకుంటున్నారు. కొంతమంది నాటు నాటు క్రేజ్‌ను బిజినెస్‌కు వాడుకుంటుంటే మరికొంతమంది జనాల్లో అవగాహన తీసుకురావడానికి వాడుతున్నారు. తాజాగా ఈ పాటను ఉత్తరప్రదేశ్ పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహనం కల్పించడానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న పాట “నాటు నాటు” పాటను ఉపయోగించుకున్నారు. అది ప్రస్తుతం వైరల్‌గా మారింది.

రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యూపీ పోలీసులు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌ను వాడుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పోస్టర్‌ను ట్రాఫిక్ రూల్‌కు అనుగుణంగా ఎడిట్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ను సూచించేలా ” Respect the Red light on the Road” అని ఎడిట్ చేయగా.. అది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రెడ్ లైట్ పడినప్పుడు ఆగాలని ఆ విధంగా అవగాహన కల్పించారు. ఈ ఫోటోతో పాటు మరికొన్ని నిబంధనలను సూచించారు. ద్విచక్రవాహనంపై ఇద్దరి కన్నా ఎక్కువ మంది ఉండొద్దని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయొద్దని వివరించారు. ఇలా చెప్తే ప్రజలకు త్వరగా అర్థమవుతుందని పోలీసులు ఈ ట్రెండ్ ఫాలో అయిపోయారు.

VD12: రామ్ చరణ్ కు సెట్ కాలేదు విజయ్ కు సెట్ అవుతుందా..?

ప్రజలకు రోడ్డు నిబంధనలను వివరిస్తూ వారిని చైతన్యపరిచేందుకే నాటునాటు పాటను రిఫరెన్స్‌గా తీసుకున్నామని యూపీ పోలీసులు వెల్లడించారు. చాలా రోజులుగా తాము బాలీవుడ్ పాటల్ని ఇలా రిఫరెన్స్‌గా తీసుకుని రూల్స్‌ గురించి చెబుతున్నామన్నారు. మహిళా భద్రతతో పాటు మరి కొన్ని విషయాల్లోనూ అవగాహన కల్పిస్తున్నామని ఆ రాష్ట్ర పోలీసులు స్పష్టం చేశారు. “నాటు నాటు” పాటను పాడిన రాహుల్ సిప్లిగంజ్.. రోడ్డు భద్రత కోసం దీనిని ఉపయోగించినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులకు ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. రహదారి భద్రత ప్రచారానికి ఆకర్షణీయమైన నినాదాన్ని రూపొందించడంలో ఈ పాట సహాయపడిందని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ అన్నారు.

 

Show comments