NTV Telugu Site icon

Naa Saami Ranga : అల్లరి నరేష్ పాత్ర తో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా..?

Whatsapp Image 2024 01 10 At 8.56.02 Pm

Whatsapp Image 2024 01 10 At 8.56.02 Pm

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున మరో సారి సంక్రాంతి బరిలో నిలిచారు.ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘నా సామి రంగ’.. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతోంది..సంక్రాంతి పండుగకు ముందుగా మహేశ్ బాబు ‘గుంటూరు కారం’,తేజ సజ్జా ‘హనుమాన్’ ఆ తర్వాత వెంకటేశ్ ‘సైంధవ్’ రిలీజ్ అయిన తర్వాత ‘నా సామిరంగ’ బరిలోకి దూకనుంది.. ఈ మూవీలో నాగార్జునతో పాటు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ వంటి ఇద్దరు యంగ్ హీరోలు కూడా నటించారు. అయితే ఈ మూవీలో అల్లరి నరేశ్ పాత్ర గురించి పలు రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఆ పాత్రలో ఒక ట్విస్ట్ ఉండనుందని సమాచారం..‘నా సామిరంగ’లో అల్లరి నరేశ్ పాత్ర పేరు అంజి అని మూవీ టీమ్ రివీల్ చేసింది. ఈ పాత్రను రివీల్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైన గ్లింప్స్ కూడా విడుదల చేసింది. అయితే ఇందులో రాజ్ తరుణ్ పాత్రకంటే అల్లరి నరేశ్ పాత్రకే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు అనిపిస్తుంది..

అయితే ‘నా సామిరంగ’లో అల్లరి నరేశ్ పాత్ర ఒక ఊహించని ట్విస్ట్ తో వస్తుందని సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. ఒకవేళ ఇది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఏమో అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెగిటివ్ షేడ్స్ ఉండడం మాత్రమే కాకుండా నాగార్జునను మోసం చేసే రోల్ అయ్యింటుందా అని నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు..‘నా సామిరంగ’ దర్శకుడు విజయ్ బిన్నీ.. ఇప్పటికే అల్లరి నరేష్ కెరీర్లో అంజి అనేది మరో గుర్తుండిపోయే పాత్ర అవుతుందని హామీ ఇచ్చారు . అంతే కాకుండా ‘గమ్యం’ మూవీ వల్ల అల్లరి నరేశ్ కు ఎంత పేరొచ్చిందో ‘నా సామిరంగ’ వల్ల కూడా అంతే పేరు వస్తుందని అన్నాడు. ఇక టీజర్లో కూడా అల్లరి నరేశ్ వాయిస్ ఓవర్ తో నే నాగార్జునకు ఎలివేషన్స్ ఇచ్చారు. దీంతో కచ్చితంగా అల్లరి నరేష్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని ప్రేక్షకులు కూడా నమ్ముతున్నారు. మరి సినిమా విడుదల అయ్యాక అల్లరి నరేష్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.ఇక ఈ మూవీలో నాగార్జునకు జోడీగా అషికా రంగనాథ్ నటిస్తుండగా.. అల్లరి నరేష్ జోడీగా మిర్నా మీనన్ నటించగా.. రాజ్ తరుణ్ జోడీగా రుక్సార్ నటించింది