NTV Telugu Site icon

Naa Saami Ranga Day 1 collections : దిమ్మతిరిగే కలెక్షన్స్ ను అందుకున్న ‘నా సామిరంగ’.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

Naa Saami Ranga

Naa Saami Ranga

తెలుగు చిత్ర పరిశ్రమలో కింగ్ అక్కినేని నాగార్జున సినిమాలకు ఒక లెక్క ఉంటుంది.. ఒక ప్రత్యేకమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తారు.. తాజాగా నాగార్జున హీరోగా వచ్చిన సినిమా ‘నా సామిరంగ’.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా నిన్న విడుదలైంది.. ఈ సినిమాకు ఊహకు అందని విధంగా మంచి హిట్ టాక్ ను అందుకుంది.. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఇక మొదటి రోజు కలెక్షన్స్ ను ఏ మాత్రం రాబాట్టిందో ఒకసారి చూసేద్దాం..

డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమానే ‘నా సామిరంగ’. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు..

అయితే ఈ సినిమాకు నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 18.20 కోట్లు బిజినెస్ అయింది.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ వచ్చింది. కానీ, దానికి ఏమాత్రం సంబంధం లేకుండా రెస్పాన్స్ ఓ మోస్తరుగానే వచ్చింది. దీంతో ఈ చిత్రం మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ ను వసూల్ చేసింది.. మొత్తంగా చూసుకుంటే 8. 6 కోట్లను అందుకుంది.. ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది..

Show comments