Site icon NTV Telugu

Mynampally Hanumanth Rao: మనమే నష్షపోతాం.. మార్వాడీ హటావో నినాదానికి నేను వ్యతిరేకం!

Mynampally Hanumantha Rao

Mynampally Hanumantha Rao

‘మార్వాడీ హటావో’ నినాదానికి తాను వ్యతిరేకం అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు తెలిపారు. మనమంతా భారతీయులం అని, భారతీయులంతా ఎక్కడైనా జీవించవచ్చన్నారు. అందరికి ఒక్కటే రాజ్యాంగం, అందరికీ ఒక్కటే పాస్ పోర్డ్ అని పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలలో మన తెలంగాణ వారు స్ధిర నివాసం ఏర్పచుకొన్నారని.. హటావో భీజం పెరిగి పెద్దదైతే మనమే నష్ష పోతామని, అభివృద్ధి కుంటు పడుతుందన్నారు. ఈ వివాదం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అని మైనంపల్లి చెప్పుకొచ్చారు.

Also Read: AP Liquor Scam: రూ.3500 కోట్ల స్కామ్‌.. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు!

‘విదేశాలలో మన భారతీయులు ఎన్నో ఉన్నత పదవులు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మినీ ఇండియా. వివిధ రాష్ట్రాలలో మన తెలంగాణ వారు స్ధిర నివాసం ఏర్పచుకొన్నారు. మార్వాడీ హటావో భీజం పెరిగి పెద్దదైతే మనమే నష్షపోతాము, అభివృద్ధి కుంటు పడుతుంది. కులాల వారిగా, మతాల వారిగా విడిపోతే నష్టపోయేది మనమే. నీవు, నేను కలిస్తేనే మనం. మనం మనం కలిస్తే జనం. ఎక్కడో జరిగిన పొరపాటు ఇక్కడ రుద్దడం సరికాదు. తప్పు చేసిన వారు శిక్షార్హులు. అందరు కలసి సమైక్యంగా కలిసి ఉందాం. మన అందరి పిల్లలు విదేశాలలో ఉన్నారు కదా?, అక్కడ నుండి వెల్లకొడితే ఎలా?. ఇది నా వ్యక్తి గత అభిప్రాయం’ అని మైనంపల్లి హనుమంత్ రావ్ అన్నారు.

Exit mobile version