Site icon NTV Telugu

Mynampally Hanumanth Rao: కల్వకుంట్ల కుటుంబం మాటల గారడీ ఇక చెల్లదు..

Mynampally

Mynampally

మల్కాజ్ గిరి ఎన్నికల వ్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు మంత్రి కేటీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ వయస్సుకు మించి మాట్లాడుతున్నాడు.. ఇక్కడ మోడీని గూండా అని తిట్టి.. ఢిల్లీకి వెళ్లి ఆయన కాళ్లు పెట్టుకుంటావు.. బీజేపీతో మ్యాచ్ పికెటింగ్ చేసుకున్నారు.. మీ నాన్న ఒక బ్రోకర్ 20 లక్షల మంది డబుల్ బెడ్ రూంలకు అప్లై చేస్తే లక్ష బెడ్ రూంలు కట్టలేదు.. పబ్ లకు వెళ్తావ్, కొకైన్ డ్రగ్స్ తీసుకొని సినీ యాక్ట్రర్స్ తో తిరుగుతావు అంటూ విమర్శించారు. అమరవీరుల త్యాగ ఫలితం తెలంగాణ వారి ఉసురు మీకు తగులుతుంది.. నన్ను గుండా అని అంటావ్.. నీ చరిత్ర బయటకు తీస్తా.. ఉద్యమకారులను, సెటిలర్స్ ను అందరిని సమస్వయ పరచిన నన్ను గుండా అంటావా అని మైనంపల్లి హన్మంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Health Tips : పరగడుపున వెల్లుల్లి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

నన్ను గుండా అంటే భగత్ సింగ్ ను, అల్లూరిని కూడ గుండా అన్నట్లేనని మైనంపల్లి హన్మంతరావు అన్నారు. నా నియోజక వర్గాన్ని అభివృద్ది చేసిన నన్ను అనే అర్హత లేదు.. మీ నాన్న ప్రగతి భవన్ నుండి పామ్ హౌస్ వెళ్లడానికి సంవత్సరానికి 80 కోట్లు ఖర్చుపెడుతున్నారు.. సామాన్యజనం ఉసురుతో పోతావు.. మల్కాజ్ గిరికి ఎన్నిసార్లు వచ్చావు.. మీ బావ ట్రంక్ డబ్బా, రబ్బరు చెప్పులు, ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించుకున్నాడని ఆయన ప్రశ్నించారు. సమాజంలో అన్ని మతాలను కలుపుకుపోయే మనస్తత్వం నాది.. మీఇంట్లో అందరూ పోటీ చేసి నాయకులు కావచ్చు.. కానీ మా ఇంట్లో ఇద్దరం పోటీ చేయకూడదా అని మైనంపల్లి హన్మంతరావు అడిగారు.

Read Also: Pariksha Pe Charcha: పరీక్షపై చర్చ కోసం రిజిస్ట్రేషన్స్.. మోడీతో మాట్లాడే ఛాన్స్..

కల్వకుంట్ల కుటుంబం మాటల గారడీ ఇక చెల్లదు అని మైనంపల్లి ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలుస్తుంది.. మీ బండారం బయటపెడతా.. పోలీసుల సహకారంతో డబ్బులు తరలిస్తున్న సంగతి నాకు తెలుసు.. నా మీద ఐటీ రైడ్స్ చేయమని అధికారులకు చెప్పింది నీవేగా.. నేను మెదక్ లో పేద ప్రజలకు ఇళ్లు, స్కూల్ కట్టించి సామాజిక సేవ చేస్తున్నా.. మీడియాతో ప్రేమగా ఉంటా.. దళిత, లంబాడీ భూముల లాక్కున్న చరిత్ర మీది అని ఆయన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ కు వ్యతిరేక గాలి ఉన్నప్పుడు నేను గెలిచా.. పేపరు లీకులు చేసేది నీవు.. కోట్ల డబ్బులు తీసుకొని మంత్రి పదువులు ఇచ్చే సంస్కృతి నీది.. పోలీస్ అధికారులు చేతిలో ఉన్నారని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అంటూ మైనంపల్లి హన్మంతరావు మండిపడ్డారు.

Exit mobile version