NTV Telugu Site icon

My Name is Shruthi :ఓటీటీలోకి వచ్చేస్తున్న హన్సిక లేటెస్ట్‌ క్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Whatsapp Image 2023 12 10 At 10.56.35 Pm

Whatsapp Image 2023 12 10 At 10.56.35 Pm

యాపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ తెలుగులో ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఆ తరువాత ఈ భామకు తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో ఎక్కువగా తమిళ చిత్రాలు చేస్తూ అక్కడే బిజీ అయిపొయింది.రీసెంట్ గా ఈ భామ వివాహ బంధం లోకి అడుగు పెట్టింది. పెళ్లయిన తర్వాత ప్రొఫెషనల్‌ కెరీర్ పరంగా హన్సిక స్పీడ్ పెంచేసింది. వరుసగా సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది.ముఖ్యంగా క్రైమ్‌ థ్రిల్లర్‌ లు, సిరీసుల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తోంది..హన్సిక నటించిన లేటెస్ట్‌ మూవీ ‘మై నేజ్ ఈజ్ శృతి’.డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఓంకార్‌ స్కిన్‌ మాఫియా అంశంతో ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించాడు.

నవంబర్ 17న థియేటర్లలో విడుదలైన మై నేమ్ ఈజ్ శృతి ఆడియెన్స్‌ను బాగానే అలరించింది. ముఖ్యంగా సస్పెన్స్‌ అండ్ థ్రిల్లర్ జోనర్ మూవీస్ చూసే వారికి ఈ మూవీ బాగా నచ్చింది. థియేటర్లలో యావరేజ్‌గా నిలిచిన హన్సిక మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మై నేమ్‌ ఈజ్‌ శృతి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 17 నుంచి హన్సిక మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకొచ్చే అవకాశముందని తెలుస్తోంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మై నేజ్ ఈజ్ శృతి స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.మై నేమ్ ఈజ్‌ శృతి చిత్రంలో మురళీశర్మ, నరేన్‌, పూజా రామచంద్రన్, సాయి తేజ, రాజా రవీంద్ర, ప్రవీణ్‌, ఆడుకులం నరేన్‌ మరియు జయ ప్రకాశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రమ్య ప్రభాకర్‌, నాగేంద్ర రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. అలాగే మార్క్‌ కె రాబిన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు

Show comments