NTV Telugu Site icon

Narsinghanand Saraswati Controversy: ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు.. పాతబస్తీలో నిరసనలు

Protest

Protest

హాజరత్ మొహమ్మద్ ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగనంద్ సర్వతిని వెంటనే అరెస్ట్ చేయాలని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ముస్లిం సోదరులు నిరసనలు తెలుపుతున్నారు. హైదరాబాద్ చార్మినార్ ముందు ముఫ్తి ఖాలీద్ మోహిఉద్దీన్, పలు ముఫ్తిలు, ఉలేమాలు, పలు సంస్థ సభ్యులు, ముస్లిం సోదరులతో కలిసి తమ నిరసనలు తెలిపారు. యతి నర్సింగనంద్ సరస్వతిని అరెస్ట్ చేసి చట్టరీత్య చర్యలు చేపట్టాలని డీమాండ్ చేస్తూ యతి నర్సింగనంద్ సరస్వతి ఫోటోలు నెల మీద వేసి తొక్కుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. హాజరత్ మొహమ్మద్ ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి ముస్లిం మనోభావాలను బెబ్బతీసిన నిందితుడి పై చట్టరీత్య చర్యలు చేపట్టి మరొకరు ఇలా చెయ్యకుండా కఠిన చర్యలు చేపట్టాలని మీడియా ద్వారా పోలీసులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

READ MORE: Matka Teaser : మనకు ఏది అవసరమో అదే ధర్మం.. ఆసక్తి రేపుతున్న ‘మట్కా’ టీజర్‌

ఘజియాబాద్‌లోని లోహియా నగర్‌లోని హిందీ భవన్‌లో సెప్టెంబర్ 29న జరిగిన బహిరంగ కార్యక్రమంలో యతి నర్సింహానంద్ సరస్వతి హాజరయ్యారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా దసరా రోజున రావణుడ్ని దహానం చేయడం చేస్తుంటారు. అయితే రావణుడ్ని కాదని, ఇక మీదట మొహమ్మద్ దిష్టిబొమ్మను కాల్చండంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లింగ్ సంఘాలన్ని భగ్గుమన్నాయి. ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు.

READ MORE:Canada: కెనడాలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇది.. “వెయిటర్” ఉద్యోగం కోసం బారులు..

Show comments