‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో గజల్ సంగీత దర్శకుడు కుల్దీప్ సింగ్, గాయకుడు జస్వీందర్ సింగ్, రచయిత షకీల్ షాయర్ పాల్గొన్నారు. భారత రత్న, పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో ప్రఖ్యాత గజల్ సంగీత దర్శకుడు కుల్దీప్ సింగ్, గాయకుడు జస్వీందర్ సింగ్, గజల్స్ రచయిత షకీల్ షాయర్ లు పాల్గొని జూబ్లీహిల్స్ జీహిచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొక్కలను పెంచడం ద్వారా పచ్చదనం పెరిగి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, మానవాళి సురక్షిత జీవనం గడుపుతుందన్నారు.
ప్రకృతికి, సంగీతానికి విడదీయలేని అనుబంధం ఉందని, ఈ రెండింటితోనే మన జీవితాలు సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉంటాయన్నారు… ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో గ్రినరీ పెరిగి మరింత పచ్చదనం సంతరించుకుందని ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని అన్నారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొనే గొప్ప అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి కుల్దీప్ సింగ్, గాయకుడు జస్వీందర్ సింగ్, రచయిత షకీల్ షాయర్ కృతజ్ఞతలు తెలిపారు.ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.
