NTV Telugu Site icon

Music director Chakri death: అన్నయ్య మరణంపై అనుమానం ఉంది : చక్రి తమ్ముడు

New Project (29)

New Project (29)

Music director Chakri death: ఎన్నో మధురమైన పాటలు ఇచ్చిన సంగీత దర్శకుడు చక్రీని తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాజీ సినిమాతో తెలుగు తెరకు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, సత్యం, ఇడియట్, దేశముదురు లాంటి సినిమాలకు సూపర్ సాంగ్స్ ఇచ్చారు. 2014 లో గుండెపోటుతో 39 ఏళ్ల వయసులోనే మరణించారు. చక్రీ చనిపోయాక ఆయన కుటుంబ సభ్యులకు, భార్యకు మధ్య ఆస్తుల విషయంలో గొడవలు తలెత్తాయి. ఈ వివాదానికి సంబంధించిన ఈ వార్తలు మీడియాలో తెగ ప్రచారం అయ్యాయి.

Read Also: Guahar Khan: రంజాన్ ఉపవాసంపై సింగర్ షాకింగ్ కామెంట్స్.. గౌహర్ కౌంటర్

కాగా.. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ ప్రస్తుతం సంగీత దర్శకుడిగా సినిమాలు చేస్తు్న్నాడు. ఆయన ఈ మధ్య మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ విషయాలు తెలియజేశారు. తన అన్నయ్య గురించి మాట్లాడుతూ చక్రి మరణం జీవితంలో తీరని లోటన్నాడు. ఇక తన తల్లి ఇప్పటికీ ఆ విషాదం నుండి బయటపడలేదని, ఇంట్లో టీవీ పెడితే ఎక్కడ అన్నయ్య పాటలు వస్తే తను ఏడుస్తుందో అని.. చెప్పుకొచ్చాడు మహతి. ఇక 2014లో చక్రి మరణించిన సమయానికి తమ వదినతో జరిగిన గొడవ వల్ల తమ ఇంట్లో లేము.. వేరే ఇంట్లో ఉన్నాము అని.. ఇక ఆరోజు రాత్రి తన అన్నయ్య తమ దగ్గరికి వచ్చి మరి మళ్లీ ఇంటికి వెళ్ళిపోయాడు అని.. ఇక మరుసటి రోజే అన్నయ్య మరణ వార్త వినాల్సి వచ్చిందన్నాడు.

Read Also: Shivathmika: ఆ గ్యాప్‎లోనే ‘దొరసాని’కి అర్థమైందంట

తన అన్నయ్య మరణం పై తనకి ఇప్పటికీ అనుమానం ఉందన్నాడు.. చక్రిది సహజ మరణం అయినప్పుడు పోస్టుమార్టం చేయించడానికి ఎందుకు భయపడ్డారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కొంతమంది చక్రి రాత్రి తమ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ విషం పెట్టి చంపింది అని పోలీసులు ఫిర్యాదు చేశారు అంటూ.. ఎక్కడైనా కొడుకులు కన్నతల్లి విషయం పెట్టి చంపుతుందా అని ఆరోపించారు.