Musi River: హైదరాబాద్‌లో వరుస వర్షాల తర్వాత ఉద్ధృతంగా ప్రవహించిన మూసీ నది వరద పూర్తిగా తగ్గింది. జంట జలాశయాలకు (హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్) ఇన్ఫ్లో తగ్గడంతో జలమండలి అధికారులు మూసీకి నీటి విడుదలను తగ్గించారు. ఉస్మాన్ సాగర్‌కు ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, కేవలం 121 క్యూసెక్కుల నీరు మాత్రమే మూసీలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్‌కు 1,800 క్యూసెక్కుల ఇన్ఫ్లోతో, 339 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో నిన్న మొత్తం 6,200 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఇన్ఫ్లో క్రమంగా తగ్గిపోవడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని కాలనీల్లో వరద ముప్పు పూర్తిగా తగ్గిందని జలమండలి వెల్లడించింది. దీంతో ఆయా కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
READ MORE: Naga Chaitanya: నాగ చైతన్య లైఫ్‌లో మిస్ అయిన అమ్మాయి ఎవరో తెలుసా?
కాగా.. మొంథా తుఫాన్ ప్రభావంతో రెండురోజులు సిటీలో నాన్‌స్టాప్ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు వర్షం పడింది. ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే వారు, తిరిగి వచ్చేవారికి ఇబ్బందులు పడ్డారు. చిన్న గోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్ అండ్ పాస్ కింద స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకోగా, క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఐటీ ఐరిడార్ లో బుధవారం నుంచి రాత్రి వరకు ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మైండ్ స్పేస్ నుంచి బయో డైవర్సిటీ రూట్ లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు హైటెక్ సిటీ నుంచి మాదాపూర్, కూకట్ పల్లి మార్గాలు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ రోజుల వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో నగర వాసులు కొంత ఉపశమనంగా భావిస్తున్నారు.
