NTV Telugu Site icon

Murali Vijay: దక్షిణాది క్రికెటర్స్ అంటే ఎందుకు వివక్ష: మంజ్రేకర్‌కు విజయ్‌ కౌంటర్

4

4

టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. గతంలో రవీంద్ర జడేజా, హర్ష భోగ్లేలపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీసీసీఐ కామెంటరీ ప్యానెల్ నుంచి సుదీర్ఘ కాలం పాటు నిషేధానికి గురైన మంజ్రేకర్.. మళ్లీ అదే తరహా కామెంట్స్‌తో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీ ఓపెనర్ మురళీ విజయ్‌‌ను తక్కువ చేస్తూ మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్‌పై విజయ్ కూడా ఘాటుగా స్పందించాడు. దక్షిణాది ఆటగాళ్లను ప్రశంసించడానికి ముంబై ఆటగాళ్లకు మనసొప్పదని ట్వీట్ చేశాడు. దాంతో దక్షిణాది అభిమానులు మురళీ విజయ్‌కు మద్దతుగా నిలుస్తూ.. మంజ్రేకర్‌పై మండిపడుతున్నారు.

ఇదీ జరిగింది..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టుకు సంజయ్ మంజ్రేకర్ కామెంటేటర్‌‌గా వ్యవహరిస్తున్నాడు. శుక్రవారం రెండో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌పై అద్భుతంగా ఆడిన హిట్ మ్యాన్.. కెరీర్‌లో 9వ శతకం సాధించాడు. ఈ క్రమంలో పలు రికార్డుల్ని తిరగరాశాడు. స్వదేశంలో అత్యధిక 50+ రన్స్ సాధించిన బ్యాటర్‌గా నాలుగో స్థానంలో నిలిచాడు. ఇదే జాబితాలో మురళీ విజయ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ లిస్ట్‌ను చూసిన మంజ్రేకర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. విజయ్ టాప్‌లో ఉండటం చాలా సర్‌ప్రైజ్‌డ్‌గా ఉందని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతడి కామెంట్స్‌పై మండిపడిన మురళీ విజయ్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించాడు. ‘సర్‌ప్రైజ్‌డ్ వావ్‌.. ముంబైకి చెందిన మాజీ క్రికెటర్లు దక్షిణాది ఆటగాళ్లను ప్రశంసించడానికి మనసొప్పదు’ అని మురళీ విజయ్‌ పోస్టు పెట్టాడు. ఫ్యాన్స్ కూడా విజయ్‌‌కు మద్దతుగా నిలుస్తూ మంజ్రేకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మురళీ విజయ్‌ చేసిన ట్వీట్‌పై సంజయ్‌ మంజ్రేకర్ స్పందించాడు. తాను అలా ఆశ్చర్యపోవడానికి గల కారణం ఏంటో వివరించాడు. “రోహిత్ శర్మ ఇప్పుడు స్వదేశంలో 8 శతకాలు సాధించాడు. కన్వర్షన్‌ రేట్‌లో (50+ పరుగులు) రెండో స్థానానికి వచ్చాడు. ఇదే జాబితాలో మురళీ విజయ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఆడిన ఇన్నింగ్స్‌లను మరిచిపోలేం. మొత్తం 12 సెంచరీల్లో తొమ్మిది స్వదేశంలోనే చేసి కన్వర్షన్ రేట్‌లో టాప్‌లో ఉన్నాడు” అని వ్యాఖ్యానించాడు. గత నెలలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మురళీ విజయ్‌ తన కెరీర్‌లో 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.

Also Read: Rohit Sharma: వాడు కొంచెం పిచ్చోడు, స్మిత్‌పై రోహిత్ వ్యాఖ్యలు.. వీడియో వైరల్