Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Munugode Liquor Row Rajgopal Reddys Strict Rules Shake Traders

Off The Record: మునుగోడు మందు గోలలో కొత్త మలుపులు..నా రూలే ఫైనల్‌ అంటున్న ఎమ్మెల్యే!

Published Date :November 20, 2025 , 10:10 pm
By Sampath Kumar
  • మునుగోడు మందు గోలలో కొత్త మలుపులు
  • నా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాల్సిందేనంటున్న ఎమ్మెల్యే
  • వైన్స్‌ షాపుల ఏర్పాటుకు రాజగోపాల్‌రెడ్డి సొంత రాజ్యాంగం
  • నష్టం వస్తే నేను సగం భరిస్తానంటున్న ఎమ్మెల్యే
  • రాజగోపాల్‌రెడ్డిని కలిసిన వైన్స్‌ షాపుల యజమానులు
  • లాభ నష్టాలు, తమ కష్టం గురించి వివరణ
  • మనసు మార్చుకునే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే
  • ఎక్సైజ్‌తో సంబంధం లేదు, నా రూలే ఫైనల్‌ అంటున్న రాజగోపాల్‌
  • ఎమ్మెల్యే, డిపార్ట్‌మెంట్‌ మధ్య నలిగిపోతున్న వ్యాపారులు
Off The Record: మునుగోడు మందు గోలలో కొత్త మలుపులు..నా రూలే ఫైనల్‌ అంటున్న ఎమ్మెల్యే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

గవర్నమెంట్‌ రూల్స్‌ గీల్స్‌ జాన్తానై….. నా నియోజకవర్గంలో నేను చెప్పిందే వేదం. నేను రాసిన రాజ్యాంగమే నడవాలని ఆ ఎమ్మెల్యే అంటున్నారా? అది కాదు సార్‌….. కాస్త వినండని వ్యాపారులు చెప్పబోయినా, మాటల్లేవ్‌… మాట్లాడుకోవడాల్లేవ్…. నా మాటే శాసనం అని అంటున్నారా? ఎవరా శాసనసభ్యుడు? ఏ విషయంలో అంత కఠినంగా ఉన్నారు?.

మునుగోడు మందుగోల అంతకంతకూ పెరుగుతూ యమా ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఇందులో తగ్గేదెవరు? నెగ్గేదెవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో కొత్త కొత్త మలుపులు కూడా ఉండబోతున్నాయన్న సంకేతాలు ఇంకా ఉత్కంఠ రేపుతున్నాయి. వైన్స్‌ షాపుల ఏర్పాటులో తన రాజ్యాంగాన్ని పూర్తిగా ఫాలో అవ్వాల్సిందేనని, ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సూటిగా సుత్తి లేకుండా మరోసారి చెప్పేయడంతో వ్యాపారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయిందట. నియోజకవర్గంలో వైన్స్‌ షాపులు దక్కించుకున్న వాళ్ళు ఊరి చివర పెట్టాల్సిందేనని, తాను చెప్పిన టైమింగ్స్‌లో మాత్రమే అమ్మాలని, బెల్ట్‌ షాపుల ఊసేలేదని సొంత రూల్స్‌ పెట్టారు ఎమ్మెల్యే. అంతేకాదు మీకు నష్టం వస్తే….. అందులో సగం నేను భరిస్తానంటూ… తనదైన స్టైల్లో తేల్చిచెప్పేశారట ఆయన. దాంతో మిగతా సగం మాటేంటంటూ సణుక్కుంటున్నారట వ్యాపారులు. ఇలాంటి పరిస్థితుల్లో అంత్య నిష్టూరంకంటే.. ఆది నిష్టూరమే మేలనుకుంటూ… కొందరు వైన్స్‌ షాపుల యజమానులు చేసిన ఓ ప్రయత్నం కూడా బెడిసి కొట్టిందట. చౌటుప్పల్ మినహా…. మిగతా మండలాల లిక్కర్ వ్యాపారులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని తాజాగా మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆ సందర్భంలోనే రూల్స్‌ ప్రస్తావన వచ్చిందట.

కానీ… ఆయన మాత్రం నా నియోజకవర్గంలో నా మాటే శాసనం. రూల్స్‌ విషయంలో మార్పు లేనేలేదని కుండబద్దలు కొట్టేసినట్టు చెబుతున్నారు. అంతేకాదు… షాపుల టెండర్స్‌లో స్థానికులే పాల్గొనాలని సూచించినా… కొందరు ఉద్దేశ్యపూర్వకంగా టెండర్లు దాఖలు చేశారంటూ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక షాపుల టైమింగ్ విషయంలో వెసులుబాటు అడిగిన వ్యాపారులకు స్ట్రైట్ గా నో చెప్పేశారట. దీంతో… అనవసరంగా వచ్చి కొరివితో తలగోక్కున్నామా అన్నట్టు ఫీలయ్యారట మద్యం వ్యాపారులంతా. తాము టెండర్ల కోసం చేసిన ఖర్చు, లిక్కర్ షాపులు దక్కించుకునేందుకు పడిన కష్టం, వ్యాపారంలో ఉన్న లాభ, నష్టాల గురించి వివరించినా … ఆయన ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదన్నది షాపుల యజమానుల బాధ. మీరు చెప్పినట్టు ఊరికి దూరంగానే షాపులు పెడతాంగానీ… ఎక్సైజ్‌ రూల్స్‌ ప్రకారం అమ్మకాలకు అనుమతించమన్నా… నా రాజ్యాంగం నాదేనని కరాఖండిగా చెప్పేశారట ఎమ్మెల్యే. పర్మిట్‌ రూమ్స్‌కు కూడా ప్రభుత్వం ఫీజు వసూలు చేస్తోందని చెప్పినా… నాకవన్నీ చెప్పొద్దని సీరియస్‌ అయినట్టు సమాచారం.

మరో 15 రోజుల్లో కొత్త వైన్స్ షాపులు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున… ముందే అన్నీ సెట్ చేసుకుందామనుకున్న లిక్కర్ వ్యాపారులకు రాజగోపాల్ రెడ్డిని కలిశాక కూడా నిరాశే మిగిలిందంటున్నారు. అదే సమయంలో ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చే ఇబ్బందుల్ని కూడా ప్రస్తావించారట వ్యాపారులు. లిక్కర్ షాపుల నిర్వహణలో ఎక్సైజ్ నిబంధనలు పాటించకపోతే చర్యలు ఉంటాయనే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా… వాళ్ళు యాక్షన్‌ తీసుకుంటే నేను అండగా ఉంటానని, సంబంధిత అధికారులతో మాట్లాడతానని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ఇలా…మొత్తంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నయా రూల్స్‌తో మా పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయిందని అంటున్నారు మునుగోడు మద్యం వ్యాపారులు. ఇటు ఎమ్మెల్యే దూకుడు, అటు ఎక్సైజ్ శాఖ నిబంధనలతో… కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్లుగా తమ పరిస్థితి తయారైందని వాపోతున్నారు షాపుల యజమానులు. ఈ లిక్కర్ పోరులో తగ్గేది ఎవరు… నెగ్గేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • munugode
  • munugode liquor issue
  • munugode wine shops
  • rajgopal reddy
  • rajgopal reddy rules

తాజావార్తలు

  • Drumstick Pickle Recipe: మునగ ప్రయోజనాలు తెలుసు కదా.. ఇలా సులువుగా మునగ పచ్చడి తయారు చేయండి..

  • Bhuvneshwar Kumar: “మేము బాధపడటం లేదు”.. వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌పై భువనేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Dacoit :డెకాయిట్ ఫస్ట్ డే కలెక్షన్స్.. అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్!

  • Gold Rates: బంగారం ధర జోరు.. వెండి ఉపశమనం.. నేటి ధరలు ఇలా..!

  • GDS 2nd Merit List 2026: జీడీఎస్ పోస్టుల 2వ మెరిట్ జాబితా విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions