తెలంగాణలో ఎక్కడా చూసినా మునుగోడు ముచ్చటే నడుస్తోంది. రాష్ట్ర ప్రజలతో పాటు దేశ వాప్తంగానూ మనుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనే చర్చే జరుగుతోంది. అయితే.. మునుగోడు నియోజకవర్గంలోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార టీఆర్‌ఎస్ పార్టీతో సహా ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే..ఈ నేపథ్యంలో ఈ నెల 31న మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా పర్యటన నేపథ్యంలో.. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అయితే.. తాజాగా ఆ సభను రద్దైనట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించాయి.
Also Read : Bhumana Karunakar Reddy: అమరావతి రాజధానిని జగన్ సమర్ధించలేదు..!
అయితే.. జేపీ నడ్డా పర్యటన నేపథ్యంలో మండల స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలు, ర్యాలీలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే.. రోజుకు రెండు మండలాల్లో ఆత్మీయ సమావేశాలకు ప్లాన్ చేశారు బీజేపీ నేతలు. ఇదిలా ఉంటే.. ఈ నెల 30న చండూరులో టీఆర్‌ఎస్ భారీ సభను నిర్వహించనుంది. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మునుగోడులో జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీల నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. వచ్చే నెల 3న ఈ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగనుండగా.. 6న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.