NTV Telugu Site icon

C 202 Movie: వెన్నులో వణుకు పుట్టించే ‘సి 202’ రిలీజ్ ఎప్పుడంటే?

C 202 Release Date

C 202 Release Date

C 202 Movie Release Date: మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘సి 202’. గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటించారు. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కేఏ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. కేవలం నటీనటుల హావభావాలతోనే అందరినీ ఆకట్టుకున్నారు.

Also Read: Lucifer 2: ‘జయేద్ మసూద్‌’గా పృథ్వీరాజ్‌.. ఆకట్టుకుంటున్న పోస్టర్!

సి 202 చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్‌ను పొందింది. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తవ్వడంతో చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ప్రకటించారు. అక్టోబర్ 25న విడుదల చేస్తునట్లు ఓ పోస్టర్ వదిలారు. ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా సీన్స్, సౌండ్ ఎఫెక్ట్స్ తోనే భయపెట్టిన ఈ సినిమా.. మరి థియేటర్‌లో ఏ రేంజ్‌లో భయపెడుతుందో చూడాలి. డిఫరెంట్ కాన్సెప్ట్ కథతో వస్తున్న ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన ప్రధాన పాత్రల్లో నటించారు.

Show comments