Site icon NTV Telugu

Allagadda: మరీ ఇంత ఘోరమా? కిలో చికెన్‌కి రూ.5 కమీషన్ ఇవ్వాలని మున్సిపల్ అధికారి డిమాండ్..

Chicken

Chicken

ఆళ్లగడ్డ మున్సిపాలిటీ లో చికెన్ కమీషన్ కోసం ఓ మున్సిపల్ అధికారి కక్కుర్తి పడ్డాడు. చికెన్ కిలోకి రూ.5 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆళ్లగడ్డ ఏఎన్‌ఆర్ చికెన్ సెంటర్ యజమానితో మున్సిపల్ అధికారి బేరసారాలు చేపట్టాడు. ప్రొద్దుటూరులో ఓ బార్ అడ్డాగా మున్సిపల్ అధికారి బేరం అడాడు. చికెన్ సెంటర్ యజమాని మహబూబ్ బాషాతో మరో షాప్ లైసెన్స్ కోసం బేరమాడిన ఆడియో వైరల్ అయ్యింది. ట్రేడ్ లైసెన్సు కావాలంటే రూ. లక్ష చెల్లించాలని డిమాండ్ చేశాడు.

READ MORE: SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

నష్టాల్లో ఉన్నని షాప్ కి రూ.50 వేలు ఇస్తానని వేడుకున్నా అధికారి ఒప్పుకోలేదు రూ.70 వేలు ఇస్తామని చికెన్ షాప్ యజమాని వేడుకున్నాడు.. లేదు రూ. లక్ష ఇవ్వాలని అధికారి డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వలేదని లైసెన్స్ ఉన్న షాప్ పై వెటర్నరీ అధికారులతో దాడులు నిర్వహించాడు. మున్సిపల్ అధికారి వేధింపుల నుంచి కాపాడాలని చికెన్ షాప్ యజమాని మహబూబ్ బాషా వేడుకుంటున్నాడు. కిలో కి రూ.5 చొప్పున కమిషన్ ఇవ్వలేదన్న అక్కసుతో తన షాపుపై వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్లతో కలిసి తనిఖీలు చేసేందుకు వచ్చారని మహబూబ్ బాషా వెల్లడించాడు.

Exit mobile version