NTV Telugu Site icon

Mumbai Police : నిందితుడిని జైల్లో పెట్టుకుని.. 20ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు

Jail Experience

Jail Experience

Mumbai Police : ఓ హత్య కేసులో నిందితుడిని పెట్టుకుని ఇరవై ఏళ్లుగా ముంబైపోలీసులు దేశమంతా వెతుకుతున్నారు. కానీ అతడు మరో కేసులో చిక్కుకుని జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. చోటా షకీల్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌షూటర్ మహిర్ సిద్ధిఖీ కోసం ముంబై పోలీసులు 20 ఏళ్లుగా దేశమంతా గాలించారు. ఆ తర్వాత అతడు అండర్ ట్రయిల్ జైల్లో ఉన్నాడని తెల్సుకుని షాక్ తిన్నారు. పోలీసులే కాదు న్యాయమూర్తి ఏఎమ్ పాటిల్ కూడా షాక్ అయ్యారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. దీంతో ఈకేసును ‘అన్‌సాల్వ్‌డ్ మిస్టరీ’గా మారింది.

Read Also: Nursing Student: పేరెంట్స్ తిట్టారని.. నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్ షూటర్ మహిర్ సిద్ధిఖీ మరో వ్యక్తితో కలిసి 1999లో బాంబే అమన్ కమిటీ చీఫ్ వాహిద్ అలీఖాన్‌ను హత్యచేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సిద్థిఖీ కోసం గాలింపు మొదలుపెట్టారు. కానీ అతడి ఆచూకీ లభించలేదు. చివరికి 2019లో మే 29న అతడిని అరెస్ట్ చేశారు. చోటా షకీల్ ఆదేశాలతోనే సిద్ధిఖీ ఆ హత్య చేశాడని..ఇక అప్పటినుంచి పోలీసుల కళ్లు కప్పి తిరుగుతూ ఉన్న అతడిని అరెస్ట్ చేసినట్టు కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసు విచారణను మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్ కేసుల ప్రత్యేక జడ్జి ఏఎం పాటిల్ చేశారు.

Read Also: Delhi: ఉద్యోగం ఇప్పిస్తానని కారులో ఎక్కమన్నాడు, తీరా ఎక్కాక

ఈ విచారణ హత్య కేసులో నిందితుడు సిద్దిఖీని 2019లో పోలీసులు అరెస్ట్ చేయగా..అంతకుముందు అంటే 2014 సెప్టెంబర్ 3 నుంచి సిద్ధిఖీ ఐదేళ్లపాటు మరో కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నట్టు గుర్తించారు. సీఐడీ పోలీసులు సిద్ధిఖీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంటే జైల్లోనే ఉన్న నిందితుడి కోసం పోలీసులు 20 ఏళ్లు గాలించారని వెల్లడైంది. దీనిపై న్యాయమూర్తి పాటిల్ అసహనం వ్యక్తంచేశారు. రికార్డులు పక్కాగా ఉన్నప్పటికీ నిందితుడిని పోలీసులు గుర్తించటంలో విఫలమయ్యారంటూ చీవాట్లు వేశారు. దీనిని ‘అన్‌సాల్వ్‌డ్ మిస్టరీ’గా అభివర్ణిస్తూ కేసును కొట్టివేశారు.