NTV Telugu Site icon

MIvs RR : రాజస్థాన్ ను చిత్తుచేసిన ముంబై ఇండియన్స్

Mi

Mi

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ 1000 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్ధేశించిన లక్ష్యాన్ని రోహిత్ శర్మ సేన 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ ( 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు ), అర్థశతకంతో చెలరేగిపోయాడు.. కామెరూన్ గ్రీన్ ( 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 44 పరుగులు ) రాణించాడు. ఆఖర్లో టీమ్ డేవిడ్ ( 14 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 45 పరుగులతో నాటౌట్ ) దంచికొట్టడంతో ముంబై ఇండియన్స్ ఈజీగా గెలిచింది.

Also Read : Bhatti Vikramarka : ఆలేరులో వ్యాపారాలు చేసుకోవాలంటే ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిన పరిస్థితి

ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది ఓపెనర్ యశస్వి జైస్వాల్ ( 62 బంతుల్లో 16 ఫోర్లు, 8సిక్సులతో 124 పరుగులు ) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ముంబై ఇండియన్స్ బౌలర్లకు జైస్వాల్ చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సులు కొడుతూ కేవలం 53 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు జైస్వాల్ మాత్రం దూకుడు కొనసాగదించడంతో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేసింది. మిగిలిన వారిలో జోస్ బట్లర్ ( 18 ), సంజూ శాంసన్ (14), హోల్డర్ ( 11 ) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా, పీయూష్ చావ్లా, జోఫ్రా అర్చర్, రిలే మెరెడిత్ లు ఒక్కొ వికెట్ తీశారు.

Also Read : Rain In Hyderabad : భారీ వర్షం.. తడిసి ముద్దైన హైదరాబాద్‌

Show comments