Site icon NTV Telugu

Mahela Jayawardene: 2020 నుంచి ముంబైకి ఒక్క కప్పు కూడా ఎందుకు రాలేదు? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోచ్!

Mi

Mi

Mahela Jayawardene: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఉన్న క్రేజ్ వేరు. 5 కప్పులను తన ఖాతాలో వేసుకుంది ముంబై. కానీ.. గత ఐదేళ్లుగా ముంబై ఇండియన్స్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. గత దశాబ్దంలో రోహిత్ శర్మ నేతృత్వంలోని ఈ జట్టు విజయ పరంపరను కొనసాగించింది. కట్‌చేస్తే 2020 నుంచి ఎంత ట్రై చేసినా కప్పు కొట్టలేకపోతున్నారు. 2020 నుంచి రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నప్పటికీ చివరి వరకు వెళ్లడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న హై-వోల్టేజ్ పోరుకు ముందు.. హెడ్ కోచ్ మహేల జయవర్ధనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఐదేళ్లుగా ముంబై ఎందుకు ఆందోళన చెందుతుందో వివరించారు.

READ MORE: Father Fights Crocodile: కన్నప్రేమ ముందు ఓడిన మృత్యువు.. కుమారుడి కోసం మొసలితో పోరాడిన తండ్రి!

గత కొన్నేళ్లుగా టైటిల్ గెలవలేదన్న విషయంపై తానేమీ ఆందోళన చెందడం లేదని, ఫలితం కంటే తాము అనుసరించే ‘ప్రాసెస్’ మీద నమ్మకం ఉంచడమే ముఖ్యమని స్పష్టం చేశారు. ” గతంలో 8 జట్లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం10 జట్లు ఉన్నప్పుడు పోటీ మరింత కఠినంగా ఉంటుంది. అయినప్పటికీ గత ఐదేళ్లలో రెండు మూడు సార్లు మేము ప్లేఆఫ్స్‌కు వెళ్లాం. అంటే విజయానికి అత్యంత చేరువగా వెళ్లాం. కేవలం ఆఖరి అడుగులోనే తడబడ్డాం.” అన్నారు. అలాగే ముంబై జట్టును తక్కువ అంచనా వేసే వారికి జయవర్ధనే తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కొన్ని జట్లు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క కప్పు కూడా కొట్టలేదని గుర్తు చేశాడు. ఆ జట్లతో పోలిస్తే తాము మేలంటూ వ్యాఖ్యానించారు. తాను ఎవ్వరినీ తక్కువగా చూడటం లేదన్నారు. ఒత్తిడికి లోనవకుండా ప్రస్తుత ఆటపై దృష్టి సారించడమే తమ లక్ష్యమని వెల్లడించాడు. ఇదిలా ఉండగా.. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 14 ఏళ్ల శనికి ముంబై స్వస్తి పలికింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (78) మెరుపులు మెరిపించగా, రియాన్ రికెల్టన్ (81) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదే జోరును కొనసాగిస్తూ ఈ ఏడాది ఆరో టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ముంబై పట్టుదలతో ఉంది.

Exit mobile version