NTV Telugu Site icon

Dwayne Bravo: ముంబై ఇండియన్స్ మాత్రం ఫైనల్స్ కి రావొద్దు..

Bravo

Bravo

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 ఫైనల్ కు చేరుకుంది. దీంట్లో భాగంగా ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ లకు ఉండే క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఫ్యాన్స్ ఈ రెండు టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్ లను ఎల్లో క్లాసికో గా పిలుస్తారు. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ పుల్ టీమ్స్ అయినా ఈ రెండు టీమ్స్.. గత సీజన్ లో 9,10వ స్థానాల్లో ఉండగా ఇప్పుడు ఏకంగా ప్లేఆప్స్ చేరి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాయి.

Also Read : Alibaba New Jobs: రండి బాబు రండి మా దగ్గర ఉద్యోగాలున్నాయ్.. ఆలీబాబా ఆఫర్

అయితే ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ పై చెన్నై సూపర్ కింగ్స్ గెలిచి.. నేరుగా ఫైనల్ కు చేరింది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్.. లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించింది. ఇవాళ ముంబై చేతిలో గుజరాత్ ఓడిపోతే అప్పుడు ఐపీఎల్ ఫైనల్ లో మరో ఎల్ క్లాసికో మ్యాచ్ ను మనం వీక్షించొచ్చని ఇరు జట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్యాన్స్ ఆసక్తి ఒకలా ఉంటే ఆ జట్టు మాజీ పేసర్.. ప్రస్తుత సీఎస్కే బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో మాత్రం తాను ఫైనల్ కు ముంబై టీమ్ ఆడొద్దని కోరుకుంటున్నానని వెల్లడించడం గమనార్హం.

Also Read : CM Jagan Live: వెంకటపాలెంలో సీఎం జగన్‌.. పేదలకు ఇళ్ల పట్టాల పంపణీ.. ప్రత్యక్షప్రసారం

ఇటీవలు గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత బ్రావో ఈ కామెంట్స్ చేశాడు. స్టార్ స్పోర్ట్స్ చర్చలో భాగంగా మాథ్యూ హెడెన్.. ఫైనల్ ఎవరితోని ఆడాలని మీరు కోరుకుంటున్నారు అని ప్రశ్నించడంతో.. దానికి బ్రావో ఆన్సర్ ఇస్తూ.. ముంబైతో అయితే వద్దు.. ఎందుకంటే ఆ జట్టును చూస్తే నాకు భయంగా ఉంది అని బ్రావో చెప్పాడు. అప్పుడు హెడెన్ కల్పించుకుని.. ఎందుకు అని అడగ్గా.. బ్రావో ప్రస్తుతం ప్లేఆఫ్స్ కు చేరిన టీమ్స్ క్వాలిటీ జట్లు.. ఫైనల్స్ కు ఎవరు వచ్చినా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ముంబై ఇండియన్స్ రావొద్దు అని వెల్లడించారు.

Also Read : Sathya Dev: ఎప్పుడు ఆ సీరియస్ సినిమాలు ఏం చేస్తావ్ బాసూ… కాస్త నవ్వు

ఎందుకంటే ఈ విషయం నా ఫ్రెండ్ కీరన్ పొలార్డ్ కు కూడా తెలుసు అని బ్రావో చెప్పాడు. చూద్దాం.. ఫైనల్స్ కు ఎవరొస్తారో..’అని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్, ఫైనల్స్ స్టేజ్ లో ముంబై – చెన్నై మధ్య ఎన్నో క్లాసిక్ గేమ్స్ సాగాయి. ఇప్పటివరకూ ఈ ఇరు జట్ల మధ్య ఐదు ప్లేఆఫ్స్ లో తలపడ్డాయి. ఇందులో రెండు ముంబై ఇండియన్స్ గెలవగా మూడు చెన్నై గెలిచింది. ఇక ఐపీఎల్ లో నాలుగు సార్లు ఈ రెండు జట్ల మధ్య ఫైనల్స్ జరగ్గా మూడుసార్లు ముంబై గెలిచింది. ఒక్కసారి మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ నెగ్గింది.