NTV Telugu Site icon

Women’s Premier League: ఢిల్లీ క్యాపిటల్స్​పై ముంబై ఇండియన్స్ ఘన విజయం

Mi Vs Dc

Mi Vs Dc

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబయి ఇండియన్స్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబయి బ్యాటర్లలో నాట్‌సీవర్‌ బ్రంట్‌ అర్థ శతకంతో చేయడంతో ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. 132 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నాట్ షివర్ 60 పరుగులతో అజేయంగా నిలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 37 పరుగులు చేసింది.
Alsor Read: Uttam Kumar Reddy : 2024లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం

అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ వాంగ్‌ వేసిన రెండో ఓవర్‌ మూడో బంతికి అమీలా కెర్‌కు క్యాచ్‌ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇసి వాంగ్ మూడు వికెట్లు పడగొట్టడంతో వేగంగా వికెట్లు కోల్పోయింది. ఇక చివర్లో షిఖా పాండే, రాధా యాదవ్​లు కీలక ఇన్నింగ్స్​ ఆడి 132 పరుగులు చేసింది. ఆ తర్వాత హేలీ మాథ్యూస్ మరో మూడు వికెట్లు, మెలీ కెర్ కూడా రెండు వికెట్లు పడగొట్టింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆరంభంలో వికెట్లు కోల్పోయింది. కానీ నాట్ స్కివర్-బ్రంట్ (60) హర్మన్‌ప్రీత్ (37) కీలక ఇన్నింగ్స్ ఆడి టైటిల్​ను గెలుచుకుంది.