NTV Telugu Site icon

Mumbai Crime: బాలికపై అత్యాచారం చేశాడు.. రూ.10నోట్ ఇచ్చి నోరు మూయించాడు

A Minor Girl

A Minor Girl

Mumbai Crime: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న నేర సంఘటనలు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి. నేరగాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. నేరాలు మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ముంబయిలోని ఓ పాఠశాలలో మైనర్ బాలికపై వేధింపులకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తున్న వ్యక్తి ఈ నేరానికి పాల్పడినట్లు సమాచారం. దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. అతను ఆమెపై పదేపదే లైంగిక దాడి చేయడమే కాకుండా.. అతను ఆమెకు 10 రూపాయల నోటును ఇచ్చి.. దీని గురించి ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు.

ఆ స్కూల్లో ఏం జరిగింది?
వసాయ్‌లోని ఓ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. బాధిత బాలిక నాలుగో తరగతి చదువుతోంది. ఆమె తన తల్లిదండ్రులతో నివసిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు పాఠశాలలో నిందితుడి పట్టుకుని చితకబాదారు. చివరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అందిన సమాచారం ప్రకారం నిందితుడికి 57 ఏళ్లు. పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య పాఠశాల సమయంలో చోటు చేసుకుంది. బాధితురాలు వాష్‌రూమ్‌కు వెళ్తుండగా నిందితుడు బాలికను వెంబడించాడు. భోజనం పెడతానని చెప్పి వంటగదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడి, జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని రూ.10 నోటుతో బెదిరించాడు.

Read Also:Allu Arjun: జవాన్ కి పుష్పగాడి రివ్యూ… నెక్స్ట్ అట్లీతో కన్ఫార్మ్

పాఠశాల ముగించుకుని ఇంటికి వచ్చిన బాధితురాలు తన ప్రైవేట్ పార్ట్‌లో నొప్పి వస్తుందని తల్లికి తెలిపింది. ఎంటా అని చూడగా అప్పుడు అమ్మాయి డ్రెస్‌లో ఆమె తల్లికి 10 రూపాయల నోటు కనిపించింది. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని తల్లి అడగ్గా.. ఏం జరిగిందో బాలిక చెప్పింది. స్కూల్ కిచెన్‌లో పనిచేసే మేనమామ డబ్బులు ఇచ్చాడని, ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని బాధితురాలు తన తల్లికి చెప్పిందని పోలీసులు తెలిపారు. ఇదంతా విన్న అమ్మాయి తల్లి కాళ్ల కింద భూమి కంపించింది. ఆ తర్వాత బాధిత బాలిక తల్లి వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, పోలీసుల ముందు జరిగినదంతా వివరించి, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.

ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం అధికారులకు కూడా సమాచారం అందించారు. బాలికను పోలీసులు నెమ్మదిగా అడుగగా నిందితుడు ఇలా చాలా సార్లు తన పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు షాకింగ్ సమాచారాన్ని ఇచ్చింది. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాను గత నాలుగేళ్లుగా పాఠశాలలో పనిచేస్తున్నట్లు తెలిపారు. కానీ పాఠశాల అధికారులు అందించిన సమాచారం, రికార్డుల ప్రకారం అతను కేవలం ఒక సంవత్సరం మాత్రమే అక్కడ పనిచేస్తున్నాడని తెలుస్తోంది. అతడికి ఇంతకు ముందు నేరచరిత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Read Also:Jio 7th Anniversary Offer: జియో యూజర్లకు శుభవార్త.. ఈ మూడు రీఛార్జ్ ప్లాన్‌లపై అదనపు బెనిఫిట్స్!