Double Decker Buses : దేశ ఆర్థిక రాజధాని ముంబై వాసులకు గుడ్ న్యూస్ త్వరలోనే డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు రోడెక్కనున్నాయి. వీటిని ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) డిసెంబర్లోనే ప్రీమియం ఇ-బస్ సర్వీసులను ప్రారంభించనుంది. అలాగే వచ్చే సంవత్సరం డబుల్ డెక్కర్ ఇ-బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన అనుమతులు పెండింగ్ లో ఉన్నాయని ఉన్నాయని బెస్ట్ జనరల్ మేనేజర్ లోకేష్ చంద్ర ప్రకటించారు. 2023 జనవరి 14న తొలుత పది ఐకానిక్ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఆ తర్వాత తొలి దశలో భాగంగా ఈ బస్సుల సంఖ్య క్రమంగా 50కి పెంచుతామన్నారు.
Read Also: Minister KTR : సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టాలను అమలు చేస్తాం
కాగా, వచ్చే సంవత్సరం జూన్ నుంచి 500 కార్లతో ఎలక్ట్రిక్ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు బెస్ట్ ప్రయత్నిస్తుంది. దీని కోసం ఇప్పటికే టెండర్లు కూడా పిలిచింది. ప్రజలు ‘చలో యాప్’ ద్వారా ఇ-క్యాబ్ సేవలు పొందవచ్చని బెస్ట్ అధికారి తెలిపారు. మరోవైపు మంబైతోపాటు పరిసర ప్రాంతాలకు బస్సు సర్వీసులను బెస్ట్ సంస్థ నిర్వహిస్తున్నది. మొత్తం 3,500 బస్సుల్లో 400కుపైగా ఇ- బస్సులు ఉన్నాయి. అయితే 45 నాన్ ఏసీ డబుల్ డెక్కర్ డీజిల్ బస్సులను 2023-24 నాటికి సర్వీసు నుంచి తొలగిస్తామని ఆ సంస్థకు చెందిన అధికారి తెలిపారు.