NTV Telugu Site icon

Anant Radhika Wedding : 610 మంది కమాండోలు, కోట్ల విలువైన వాచీలు… అనంత్ వెడ్డింగ్‌లో వీవీఐపీలకు స్పెషల్ ఏర్పాట్లు

Haryana Crime News (6)

Haryana Crime News (6)

Anant Radhika Wedding : దేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో రేపు అంటే జూలై 12న వివాహం జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో వివాహ వేడుకలన్నీ జరగనున్నాయి. దేశ విదేశాల నుండి చాలా మంది వీవీఐపీ అతిథులు, ప్రముఖులు ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు హాజరుకానున్నారు. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయి, ఫుడ్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి. అతిథులకు అంబానీ కుటుంబం ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందో తెలుసుకుందాం.

పెళ్లిలో పక్షి కూడా వాలకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీతో అంబానీ కుటుంబ సభ్యులందరూ పెళ్లికి హాజరుకానున్నారు. ఈవెంట్ సమయంలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఆపరేషన్ సిస్టమ్ (ISOS) సెటప్ చేశారు. ఈవెంట్ భద్రతా ఆపరేషన్ ఈ ISOS కేంద్రం నుండి పర్యవేక్షించబడుతుంది. 60 మంది భద్రతా బృందంలో 10 మంది ఎన్‌ఎస్‌జి కమాండోలు, పోలీసు అధికారులు ఉంటారు. 200 మంది అంతర్జాతీయ భద్రతా సిబ్బందిని నియమించనున్నారు. 300 మంది సెక్యూరిటీ సభ్యులు ఉంటారు. బీకేసీలో 100 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు, ముంబై పోలీసు సిబ్బందిని మోహరిస్తారు.

ఫుడ్ లో స్పెషల్ ఏంటి?
వివాహానికి 10 మందికి పైగా అంతర్జాతీయ చెఫ్‌లను ఆహ్వానించారు. ఇండోనేషియాకు చెందిన కోకోనట్ క్యాటరింగ్ కంపెనీ 100కి పైగా కొబ్బరి వంటలను సిద్ధం చేస్తుంది. మెను జాబితాలో 2500 కంటే ఎక్కువ వంటకాలు ఉండనున్నాయి. మద్రాస్ కేఫ్ నుండి కాశీ చాట్, ఫిల్టల్ కాఫీ కూడా ఉంటాయి. ఇటాలియన్, యూరోపియన్ స్టైల్ ఫుడ్ కూడా అందించబడుతుంది. ఇండోర్ గరడు చాట్, ముంగ్లెట్, కేసర్ క్రీమ్ వడ కూడా మెనులో చేర్చబడ్డాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రత్యేక ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.

అతిథులకు ఏ రిటర్న్ బహుమతి లభిస్తుంది?
పెళ్లికి హాజరయ్యే సెలబ్రిటీలు, వీవీఐపీ అతిథులకు కోట్ల విలువైన వాచీలను రిటర్న్ గిఫ్ట్‌లుగా అందజేయనున్నారు. కాశ్మీర్, రాజ్‌కోట్, బనారస్ నుండి మిగిలిన అతిథుల కోసం ప్రత్యేక బహుమతులు ఆర్డర్ చేయబడ్డాయి. బంధాని దుపట్టా, చీరల తయారీదారు విమల్ మజిథియాకు 4 నెలల ముందుగానే బహుమతులు సిద్ధం చేయాలని ఆర్డర్ ఇచ్చారు. ప్రతి దుపట్టా బోర్డర్ ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. విమల్ మొత్తం 876 దుపట్టా, చీరలు సిద్ధం చేసి పంపారు. బనారసీ ఫ్యాబ్రిక్ బ్యాగ్, ఒరిజినల్ జరీతో చేసిన జంగల్ ట్రెండ్ చీర కూడా రిటర్న్ గిఫ్ట్‌లుగా ఇవ్వనున్నారు. కరీంనగర్ కు చెందిన కళాకారులు తయారు చేసిన వెండితో చెక్కిన కళాఖండాలను కూడా అతిథులకు బహుమతులుగా అందజేయనున్నారు. అంతకుముందు, అనంత్-రాధికల మొదటి ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌లో అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌లుగా లూయిస్ విట్టన్ బ్యాగ్, గోల్డ్ చైన్, స్పెషల్ క్యాండిల్స్, డిజైనర్ పాదరక్షలు అందించారు.