Mumaith Khan : ఐటమ్ గాళ్ గా గుర్తింపు పొందిన ముమైత్ ఖాన్.. ప్రస్తుతం బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. “వీలైక్ మేకప్ & హెయిర్ అకాడమీ” ప్రారంభించారు ముమైత్ ఖాన్. ఈ అకాడమీలో బ్రైడల్, మేకప్, హెయిర్ స్టైలింగ్, కాస్మోటాలజీ, స్కిన్‌కేర్, వెల్‌నెస్ వంటి రంగాలలో నైపుణ్యం పొందిన వ్యక్తులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Also:APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదల..
యూసుఫ్‌గూడలో జరిగిన కార్యక్రమంలో ముమైత్ ఖాన్ కు తోడుగా కో-ఫౌండర్స్ కెయిత్, జావేద్, ఆర్టిస్టులు జ్యోతి, అక్స ఖాన్, సింగర్ రోల్ రైడా, డ్యాన్స్ మాస్టర్ జోసఫ్ ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అకాడమీ, సమగ్ర పాఠ్యప్రణాళిక, అత్యాధునిక సౌకర్యాలు, పరిశ్రమ-ప్రముఖ బోధకుల బృందంతో విద్యార్థులకు శక్తివంతమైన శిక్షణను అందించటానికి పయనమైంది. “ప్రపంచ స్థాయి లో ట్రెయిన్డ్ స్పెషలిస్ట్‌లుగా తయారుచేయడం మా లక్ష్యం” అని ముమైత్ ఖాన్ అన్నారు.
Read Also:US deports Indians: అక్రమ వలసదారుల బహిష్కరణ.. ఇండియా చేరిన 4వ బ్యాచ్..
“మేము శిక్షణా పద్ధతుల ద్వారా, విద్యార్థుల అభిరుచిని అభివృద్ధి చేసుకోవడంలో సహాయం చేస్తాం” అని కో-ఫౌండర్లు కెయిత్, జావేద్ తెలిపారు. ఈ అకాడమీ, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లను అందిస్తూ, యువతకు పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణను ఇస్తుంది. వాస్తవ ప్రపంచ అనుభవాలతో విద్యార్థులు పోటీ మార్కెట్లో ముందంజ వేయాలని ముమైత్ ఖాన్ ఉద్దేశించారు.