NTV Telugu Site icon

Mulugu Police: మావోయిస్టుల కుట్రను భగ్నం చేసిన ములుగు పోలీసులు!

Mulugu Police

Mulugu Police

Mulugu Police Arrest Maoists in Tadapala Forest: మావోయిస్టుల కుట్రను ములుగు జిల్లా పోలీసులు మరోసారి భగ్నం చేశారు. తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దులో గల వెంకటాపురం మండలం తడపాల అటవీ ప్రాంతంలో మందుపాతరాలు అమరుస్తుండగా.. మావోలను అరెస్ట్ చేశారు. ఒక డిప్యూటీ దళ కమాండర్, ఇద్దరు దళ సభ్యులు సహా ముగ్గురు మిలిషియా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు పట్టుకున్నారు.

Also Read: Jio Data Booster Plans: డైలీ డేటా లిమిట్ అయిపోయిందా?.. బూస్టర్ ప్లాన్స్ ఇవే!

పట్టుబడిన మావోయిస్టుల వద్ద నుండి ఒక డీబీబీఎల్ తుపాకి, నాలుగు కిట్ బ్యాగులు, రెండు వాకి టాకీలతో పాటు భారీగా ప్రేలుడు సామాగ్రిని ములుగు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ దళ డిప్యుటీ కమాండర్ కారం భుద్రి, పామేడు ఏరియా కమిటీ సభ్యురాలు సోడి కోసి, బెటాలియన్ సభ్యుడు సోడి విజయ్, మిలిషియా సభ్యుడు కుడం దస్రు, మిలిషియా సభ్యుడు సోడి ఉర్ర, మిలిషియా సభ్యుడు మడకం భీమ పట్టుబడ్డారు. వీరందరూ పలు నేరారోపిత కేసులలో ప్రధాన నిందితులుగా ఉన్నారు. మావోయిస్టుల కారణంగా సాధారణ ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తించడమే లక్ష్యంగా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.