Site icon NTV Telugu

Maoists : మావోయిస్టుల కుట్రను భగ్నం చేసిన ములుగు జిల్లా పోలీసులు

Maoist

Maoist

మావోయిస్టుల కుట్రను భగ్నం చేశారు ములుగు జిల్లా పోలీసులు. మందు పాతరను ములుగు జిల్లా పోలీస్ నిర్వీర్యం చేశారు. సాధారణ ప్రజలు తిరిగే కాలి బాటలో పెట్టిన మందుపాతరను కనిపెట్టి నిర్వీర్యం చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర సరిహద్దు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గత రెండు రోజులుగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. మావోయిస్టుల కారణంగా ఎటువంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తించడమే లక్ష్యంగా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వెంకటాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చెలిమెల గ్రామ సమీపంలో ప్రజలు తిరిగే కాలి బాటల వెంబడి మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తించారు. వాటిని సురక్షితంగా నిర్వీర్యం చేశారు. పౌరహక్కులసంఘాలు ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల అటవి ప్రాంతంలో వంట చెరుకు కోసం వెళ్ళి మందుపాతర పేలి ఒక అమాయక వ్యక్తి మరణిoచిన సంఘటన స్థలాన్ని పౌరహక్కుల సంఘాలు సందర్శించి ఇటువంటి సంఘటనని తీవ్రంగా ఖండించాలని… మావోయిస్టులకు ప్రజలు ఎవరు సహకరిచవద్దని , వారికి సంబoదించిన సమాచారం పోలీసులకు అందజేయాలని కోరడం జరిగింది.

Exit mobile version