Fake Liquor Lab Report: ములకలచెరువు నకిలీ మద్యానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టు వెలువడింది. జనార్దన్ తయారు చేసిన నకిలీ మద్యం నాణ్యత లేనిదని రిపోర్టులో తేలింది. 45 నమూనాలపై పరీక్షలు చేసిన కాకినాడ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. స్త్రెంత్ ప్రమాణాలు పాటించకుండా మద్యం తయారు చేసినట్లు తేలింది. 25 ఉండాల్సిన అండర్ ప్రూఫ్ (యూపీ) 35గా నమోదైంది. 75 ఉండాల్సిన ఓవర్ ప్రూఫ్ 65గా ల్యాబ్ రిపోర్టులో తేలింది. ప్రమాణాలకు విరుద్ధంగా మద్యం తయారు చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. నకిలీ మద్యంలో నాణ్యత లేకుండా ఎలాంటి గాఢత లేకుండా తయారు చేసినట్టు రుజువైంది.
READ MORE: Viral Video: మీరెక్కడి మనుషులురా బాబు.. తినే తిండి మీద ఊయమేంట్రా..
నకిలీ మద్యం రాష్ట్రంలో సంచలనం సృష్టించడంతో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం కొత్తగా రోజువారీ ధ్రువీకరణ వ్యవస్థను తీసుకొచ్చింది. మద్యం దుకాణాలు, బార్‌లు, ప్రీమియం స్టోర్లు సహా అన్ని లైసెన్స్‌డ్ ప్రాంగణాల్లో ఏపీఎస్‌బీసీఎల్ ధ్రువీకృత నాణ్యమైన మద్యం విక్రయాలు మాత్రమే జరిగేలా, నకిలీ మద్యం వస్తే వెంటనే గుర్తించేలా ఈ వ్యవస్థను రూపొందించింది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేస్తూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
