Site icon NTV Telugu

Mukunda Jewellers: హనుమకొండలో ‘ముకుంద జ్యువెల్లర్స్‌’ షోరూం రేపే ప్రారంభం

Mukunda Jewellers

Mukunda Jewellers

Mukunda Jewellers: మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్‌లెట్.. ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం ఈ నెల 14న(రేపే) హనుమకొండలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. రేపు ఉదయం 11 గంటల 15 నిమిషాలకు వరంగల్ పశ్చిమం ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి తమ చేతుల మీదుగా ముకుంద జ్యువెల్లర్స్‌ షోరూం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ వేముల శ్రీనివాస్‌ హాజరు కానున్నారు. ఇప్పటికే కూకట్‌పల్లి, కొత్తపేట్, ఖమ్మం, సోమాజిగూడలలో బ్రాంచ్‌లను కలిగి ఉన్న ‘ముకుంద జ్యువెల్లర్స్‌’.. హనుమకొండలోని హనుమకొండ చౌరస్తాలో తన నూతన బ్రాంచ్‌ను ప్రారంభిస్తోంది. తక్కువ ఖర్చు ఎక్కువ పొదుపుతో ఆభరణాలను కొనుగోలు చేసేలా అద్భుతమైన ఆఫర్లను ప్రకటించారు. అద్భుతమైన కలెక్షన్లతో పాటు ప్రత్యేకమైన డిజైన్లను అందుబాటులో ఉంచారు. “ముకుంద జ్యువెలర్స్” పేరుతో ఉన్న ఈ స్టోర్ డైమండ్ రింగ్‌ల నుండి అద్భుతమైన నెక్లెస్‌లు, బ్రాస్‌లెట్‌ల వరకు అధిక-నాణ్యత గల ఆభరణాలను అందిస్తోంది.

నగల తయారీలో మేకింగ్ ఛార్జీలు ఉండవని.. తరుగు చార్జీలు మాత్రం 2 నుంచి 12 శాతం మాత్రమే ఉంటాయని స్టోర్ యాజమాన్యం ప్రకటించింది. నగల తయారీ, వినూత్న డిజైన్లతో ముకుంద బ్రాండ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది స్టోర్ యాజమాన్యం. సాంప్రదాయ భారతీయ డిజైన్‌ల నుంచి ఆధునిక, సమకాలీన శైలుల వరకు అనేక రకాల ఆభరణాలను ముకుంద జ్యువెలర్స్ అందిస్తోంది. ఆకర్షణీయమైన ఆభరణాల ఎంపికతో పాటు, గ్లామర్ జెమ్స్ కస్టమ్ డిజైన్ సేవలను కూడా అందిస్తోంది. వినియోగదారులు తమ కుటుంబంలో భాగమని భావిస్తామని, వారికి అధిక నాణ్యత గల ఆభరణాలు అందించడానికి తాము ముందుంటామని స్టోర్ యజమాని వెల్లడించారు. వెండి, స్టోన్స్‌పై ఎక్సేంజ్‌ ఆఫర్‌ను కూడా ముకుంద జ్యువెల్లర్స్ ప్రకటించింది.

Exit mobile version