Site icon NTV Telugu

Afzal Ansari: నాలుగేళ్ల జైలు శిక్షతో లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన మరో ఎంపీ

Afzal Ansari

Afzal Ansari

Afzal Ansari: గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ సోదరుడు అఫ్జల్ అన్సారీ ఏప్రిల్ 29 నుంచి ఎంపీగా అనర్హుడని లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ తెలిపింది. గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద 2007లో ఒక కేసులో దోషిగా తేలి నాలుగేళ్ల జైలు శిక్ష పడిన కొద్ది రోజులకే అతనిపై అనర్హత వేటు పడింది. 2007లో అన్సారీ సోదరులపై గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద కేసు నమోదు చేయగా, 2022లో వారిపై ప్రాథమిక అభియోగాలు మోపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సోదరులకు శిక్ష విధించింది.

Read Also: MK Stalin: ఫ్యాక్టరీల్లో 12 గంటల పని బిల్లు ఉపసంహరణ.. కార్మికుల సంక్షేమమే ముఖ్యం

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి బీఎస్పీ ఎంపీ అయిన అఫ్జల్, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయాడు. ఏ సభ్యుడైనా దోషిగా తేలితే, రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించబడితే అనర్హుడవుతాడు. ఇటీవల, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్, బీజేపీకి చెందిన విక్రమ్ సైనీలు ఇదే చట్టంలోని నిబంధనల ప్రకారం తమ ఎంపీ హోదాను కోల్పోయారు. ప్రస్తుతం యూపీలోని బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ ఉత్తరప్రదేశ్‌లోని మౌ సదర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు 2022 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలేదు. అతని స్థానాన్ని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) నుంచి అతని కుమారుడు అబ్బాస్ అన్సారీ గెలుచుకున్నారు.

Exit mobile version