MS Dhoni Practices Helicopter Shot Ahead of IPL 2024: ఐపీఎల్ 2024 పండుగ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రమే కాకుండా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఆడుతుండడంతో ఫుల్ క్రేజ్ ఏర్పడింది.
చెన్నై సూపర్ కింగ్స్ తన ట్రైనింగ్ క్యాంప్‌ను ఎప్పుడో ఆరంబించగా.. కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇటీవల జాయిన్ అయ్యాడు. ప్రాక్టీస్‌లో ధనాధన్ షాట్లతో మహీ అలరించాడు. గత ఐపీఎల్ సీజన్ నుంచి ఆటకు దూరమైనా ధోనీ ఫామ్‌లోనే ఉన్నాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో హెలికాఫ్టర్ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ధోనీ షాట్స్ చూసిన సీఎస్‌కే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Cheapest Diesel Car: చౌకైన డీజిల్ కారు.. 20 కిమీ కంటే ఎక్కువ మైలేజ్!
42 ఏళ్ల ఎంఎస్ ధోనీ గతేడాది మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం విశ్రాంతి తీసుకున్న ధోనీ.. గత మూడు నెలల నుంచి కసరత్తులు మొదలుపెట్టాడు. జార్ఖండ్‌లోని మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. ఆపై సీఎస్‌కే ట్రైనింగ్ క్యాంప్‌లో చేరాడు. ఐపీఎల్ 2023లో పెద్దగా పరుగులు చేయని మహీ.. కెప్టెన్‌గా మాత్రం సత్తాచాటాడు. అద్భుత సారథ్యంతో చెన్నైకి అయిదో టైటిల్ అందించాడు. ఈ ఏడాది చెన్నైకి మరో టైటిల్ అందించాలని చూస్తున్నాడు.
MS Dhoni with a helicopter shot in the practice session.
– MSD is preparing hard for the IPL.pic.twitter.com/6YDYRK8QQy
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2024