Site icon NTV Telugu

MS Dhoni: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోనీ.. కోహ్లీకి కూడా సాధ్యం కాలే!

Ms Dhoni, Jadeja

Ms Dhoni, Jadeja

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ఓ జట్టుపై 50 సిక్సర్లు​ బాదిన మూడో ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మహీ.. ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌, హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ ముందున్నారు. పంజాబ్‌ (61), కోల్‌కతా (54)పై గేల్‌ 50 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టాడు. ఢిల్లీపై రోహిత్ 50 సిక్సర్లు బాదాడు.

Also Read: Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ కాలేదు, సన్‌సెట్ అయింది.. అంతా అస్సాం బ్యాచే!

మరోవైపు ఆర్సీబీపై 50 సిక్సర్లు బాదిన మొదటి భారత ఆటగాడిగా ఎంఎస్ ధోనీ నిలిచాడు. డేవిడ్ వార్నర్ ఆర్సీబీపై 55 సిక్సర్లు బాది అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో ఎంఎస్ ధోనీ (262) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌ (357), రోహిత్‌ శర్మ (297), విరాట్‌ కోహ్లీ (290)లు ముందున్నారు. మహీ ఇప్పటివరకు ఆర్సీబీపై 35 మ్యాచ్‌లు ఆడి 906 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి.

Exit mobile version