మృణాల్ ఠాకూర్ ఈ పేరు వినగానే యువతకు పూనకాలు వస్తున్నాయి.. గత ఏడాది రిలీజ్ అయ్యిన బ్లాక్ బాస్టర్ మూవీ సీతారామం..మూవీతో ఈ అందాల భామ ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. సీతారామం విడుదల తర్వాత మృణాల్ ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీగా అయింది. రీసెంట్ గా `లస్ట్ స్టోరీస్ 2′ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ వెబ్ సిరీస్ లో మృణాల్ చాలా బోల్డ్ గా నటించింది..
పంచి రొమాన్స్ లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. సీతారామంలో ఎంతో పద్ధతిగా, సాఫ్ట్‌గా కనిపించిన మృణాల్.. వెబ్ సిరీస్ లో మాత్రం రెచ్చిపోయింది.. ఈ సిరీస్ విడుదలకు ముందు మృణాల్ ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూలో పాల్గొంది.. ఆ సందర్భంగా ఆమె తనకు సంబంధించి కొన్ని షాకింగ్ సీక్రెట్స్ ను లీక్ చేసింది. తన ఫస్ట్ లవ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.. టెన్త్ క్లాస్ లోనే ప్రపోజ్ చేశారు. అతను చాలా అందంగా, హ్యాండ్సమ్‌గా ఉండేవాడు. ఆ ఏజ్ లో పెద్దగా మెచ్యూరిటీ లేకపోవడం వల్ల అతడితో ఆ పని చేశాను. కొద్ది రోజులు అతనితో బాగా ఉంది. కానీ, టెన్త్ తర్వాత పై చదువుల కోసం ముంబై వెళ్లాను. దాంతో అతడితో రిలేషన్ కట్ అయిపోయింది అంటూ మృణాల్ చెప్పుకొచ్చింది..
అలా టెన్త్ క్లాస్ లోనే మృణాల్ ఠాకూర్ లవ్, బ్రేకప్ కానిచ్చేసింది. అయితే ఇండస్ట్రీలోకి రాకముందు మృణాల్ మరొక వ్యక్తిలో ప్రేమలో పడిందట. కానీ, అతడితో కూడా ఎక్కువ రోజుల రిలేషన్ కొనసాగించలేక బ్రేకప్ చెప్పిందట. ప్రస్తుతం తాను సింగిల్ స్టేటస్ ను మెయింటైన్ చేస్తున్నానని మృణాల్ అంటోంది. ఇక ఇప్పటిలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని చెప్తూనే ఇండస్ట్రీలో వాళ్లను చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అంటూ మరో సీక్రెట్ ను రివిల్ చేసింది..దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.. ప్రస్తుతం ఈమె తెలుగులో కూడా వరుస సినిమాల్లో నటిస్తుంది.. నాని 30వ సినిమాలో, విజయ్ దేవరకొండ తో మరో సినిమా చేస్తుంది.. అలాగే బాలివుడ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు కళ్లు తిప్పుకొని అందంతో ఘాటు పోజులతో పిచ్చెక్కిస్తుంది..