Site icon NTV Telugu

PEDDI : రామ్ చరణ్ సరసన రొమాన్స్ చేయబోతున్న మృణాల్

Mrunal

Mrunal

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. రామ్ చరణ్‌ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.  ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ మంచి స్పందనను రాబట్టింది. త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ ప్లాన్ చేసాడు బుచ్చిబాబు. ఈ సాంగ్ కోసం పలువురు ముద్దుగుమ్మలు పేర్లు వినిపించగా.. ఇప్పుడు టాల్ అండ్ హాట్ బ్యూటీని ఫైనల్ చేసాడు బుచ్చి.

Also Read : Icon Star : అల్లు అర్జున్ క్రేజీ లైనప్.. పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్..

ఇప్పటికే ఏఆర్ రెహమాన్ ఒక ఎనర్జిటిక్ మాస్ ట్యూన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యానికి తగ్గట్టుగా హుషారైన బీట్‌తో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుంది. అందుకు తగ్గట్టే పలువురు బ్యూటీస్ ని పరిశీలించి మృణాల్ ఠాకూర్ ను ఫైనల్ చేసాడట. రామ్ చరణ్ మాస్ స్టెప్పులతో పాటు మృణాల్ గ్లామర్ మరింత హైప్ తీసుకురావడం ఖాయం అని భావిస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్‌గా తెలుగులో ‘డెకాయిట్’ సినిమాతో పాటు.. అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్‌లోను ఒక కీలక పాత్రలో నటిస్తోంది మృణాల్. ఇప్పుడు రామ్ చరణ్‌తో స్పెషల్ సాంగ్ అంటే థియేటర్ లో ఫ్యాన్స్ కు మాంచి ట్రేట్ అనే చెప్పాలి. మార్చి లో రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు ఏప్రిల్ కు పోస్ట్ పోన్ అయినట్టు సమాచారం. మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ పై త్వరలోనే అధికారకంగా ప్రకటన రానుంది.

Exit mobile version